బ్రేకింగ్ – ఏపీలో వ‌చ్చే ఏడాది కూడా ఈ త‌ర‌గ‌తుల వారికి ప‌రీక్ష‌లు ఉండ‌వు

బ్రేకింగ్ - ఏపీలో వ‌చ్చే ఏడాది కూడా ఈ త‌ర‌గ‌తుల వారికి ప‌రీక్ష‌లు ఉండ‌వు

0
109

మార్చి నెల చివ‌రి నుంచి దేశం అంతా క‌రోనాతో లాక్ డౌన్ కు వెళ్లిపోయింది, ఈ స‌మ‌యంలో అంద‌రూ ఇంటి ప‌ట్టున ఉన్నారు, అయితే స్కూళ్లు కాలేజీలు విశ్వ‌విద్యాల‌యాలు తెర‌చుకోలేదు, ఇక విద్యార్దుల‌కి ప‌రీక్ష‌లు లేకుండా అంద‌రిని పాస్ చేయించారు , త‌ర్వాత త‌ర‌గ‌తుల‌కి నేరుగా ప్ర‌మోట్ చేశారు.

అయితే ఇప్పుడు ఏపీలో సెప్టెంబ‌ర్ ఐదు నుంచిస్కూళ్లు స్టార్ట్ అవ్వ‌నున్నాయి, దాదాపు జూన్ 12 న స్టార్ట్ అవ్వాల్సిన స్కూళ్లు, మూడు నెల‌లు లేట్ గా స్టార్ట్ అవ్వ‌నున్నాయి, అంతేకాదు సిల‌బ‌స్ కూడా త‌గ్గించ‌నున్నార‌ట‌.

30 శాతం నుంచి 40 శాతం మేర సిలబస్ తగ్గించే అవకాశం ఉంది. అయితే ఏవి ఉంచాలి.. ఏ పాఠాలు తీసేయాలని అనేది ఫైనల్ కావాల్సి ఉంది. ఇక యూనిట్ క్వాట‌ర్లీ ప‌రీక్ష‌లు ఇలా ఇంట‌ర్న‌ల్ ప‌రీక్ష‌లు జ‌రుపుతారు అని తెలుస్తోంది.

పరీక్షల విధానంపై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక ప్రకటన చేశారు. ఒకటి నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు పరీక్షలు ఉండవని స్పష్టం చేశారు. వీరందరికి ఇంటర్నల్ పరీక్షల ఆధారంగా పై తరగతులకు పంపిస్తామని చెప్పారు. 9, 10 తరగతుల విద్యార్థులకు మాత్రం తప్పనిసరిగా పరీక్షలు ఉంటాయని చెప్పారు.