బ్రేకింగ్ — రాడ్ గోపాల్ వర్మ కొత్త సినిమా ద‌ర్శ‌కుడు ఎవ‌రంటే

బ్రేకింగ్ -- రాడ్ గోపాల్ వర్మ కొత్త సినిమా ద‌ర్శ‌కుడు ఎవ‌రంటే

0
40

ఈ లాక్ డౌన్ స‌మ‌యంలో అంద‌రూ ఇంటి ప‌ట్టున ఉంటే దర్శకుడు రామ్ గోపాల్ వ‌ర్మ మాత్రం సినిమాలు తీస్తున్నారు, ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు, అభిమానుల‌కు స‌రికొత్త సినిమాలు అనౌన్స్ చేస్తున్నారు.వరుసగా సెటైరికల్ మూవీస్ రిలీజ్ చేస్తున్నారు వ‌ర్మ‌.

ఇక ఆయ‌న‌ని టార్గెట్ చేస్తూ ప‌లువురు ఆయ‌న‌పై సినిమాలు కూడా తీస్తున్నారు, అలాగే వ‌చ్చింది ప‌రాన్న‌జీవి ఇక జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ఆర్జీవీ రోజూ గిల్లే వాడు అనే సినిమా తీస్తున్నారు. ఇక తాజాగా మ‌రో చిత్రం టైటిల్ వచ్చేసింది.రాడ్ గోపాల్ వర్మ.

తాజాగా రాడ్ గోపాల్ వర్మ టైటిల్ పోస్టర్ రిలీజ్ చేస్తూ ఇది శివ కి ముందు జరిగిన కథ అని ప్రకటించారు. ఇంకా దీనిలో వోడ్కా బాటిల్ తో పాటు ఓ ఐరన్ రాడ్ ని కూడా పొందుపరిచారు. బ్లూ ఫిల్మ్ క్యాసెట్లు అమ్ముతున్న యువకుడిని అరెస్ట్ చేసిన పంజాగుట్ట పోలీసులు అనే టైటిల్ కూడా ఉంది.
ఈ చిత్రాన్ని కె.ఎస్.మణి రూపొందిస్తున్నారు.

ఇక ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వర్మ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టకముందు పంజాగుట్టలో సీడీ షాపు నిర్వహించేవాడనే విషయం అందరికి తెలిసిందే. మ‌రి ఇందులో ఆర్జీవిని టార్గెట్ చేసి సినిమా తీస్తున్నారు అనే మాట‌లు వినిపిస్తున్నాయి.