వైసీపీ ఖాతాలో 10 కి 10 జగన్ ఉత్సాహం

వైసీపీ ఖాతాలో 10 కి 10 జగన్ ఉత్సాహం

0
96

కడప జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని మెజార్టీ వస్తుంది అని, జిల్లాలో గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఒక సీటు మాత్రమే గెలుచుకుంది.. ఇప్పుడు ఈ పరిస్దితి కూడా ఉండదు అని, ఆ ఎమ్మెల్యే కూడా వైసీపీలో చేరడంతో జిల్లాలో తిరుగులేని విజయం వైసీపీకి సొంతం అంటున్నారు కేడర్. ముఖ్యంగా 10 కి 10 ఈసారి జిల్లాలో వైసీపీ గెలుచుకోవడం పక్కా అంటున్నారు.. ఓ పక్క అభ్యర్దుల ప్రకటన చేయడంతో మొత్తం రాష్ట్రంలో వైసీపీ కేడర్ అంతా ప్రచారంలో మునిగిపోయారు. ఇక వైయస్ కుటుంబం కూడా ఇక్కడ ప్రచారానికి వచ్చే వారం నుంచి ప్రణాళిక వేయనున్నారట. మరి ఆ పదికి పది గెలిచే నేతలు వీరేనట.

పులివెందుల – వైఎస్ జగన్మోహన్రెడ్డి
జమ్మలమడుగు – ఎం.సుధీర్రెడ్డి
ప్రొద్దుటూరు – రాచమల్లు శివప్రసాద్రెడ్డి
మైదుకూరు – శెట్టిపల్లి రఘురామిరెడ్డి
కమలాపురం – పోచమరెడ్డి రవీంద్రనాథ్రెడ్డి
బద్వేలు (ఎస్సీ) – జి.వెంకటసుబ్బయ్య
కడప – షేక్ అంజద్ బాషా
రాజంపేట – మేడా వెంకట మల్లికార్జునరెడ్డి
రైల్వేకోడూరు (ఎస్సీ) – కొరముట్ల శ్రీనివాసులు
రాయచోటి – గడికోట శ్రీకాంత్రెడ్డి