జగన్ కి షాక్ రెబల్ గా పోటీ చేస్తా – కీలక నేత

జగన్ కు హీట్ రెబల్ గా పోటీ చేస్తా కీలక నేత

0
36

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక్కసారిగా 175 అసెంబ్లీ సెగ్మెంట్లకు , 25 ఎంపీ సెగ్మెంట్లకు అభ్యర్దులను ప్రకటించినా కొందరు మాత్రం తమకు టికెట్ రాలేదు అనే అసంతృప్తిలో ఉన్నారు.. జిల్లాకు ఓ నలుగురు చొప్పున ఓ 50 మంది వరకూ ఇలాంటి అసంతృప్తిలో ఉన్నారు. అయితే కొందరు రెబల్ అభ్యర్దులుగా బరిలోకి దిగుతారు అని తెలుస్తోంది.

కాకినాడ రంపచోడవరం నియోజకవర్గం బరిలో వైసీపీ రెబల్ అభ్యర్థిగా రంగంలో దిగేందుకు కోడి సుజాత సన్నద్ధమవుతున్నారు. ఇప్పుడు ఇదే తూగోలో పెద్ద ఎత్తున వార్తగా వైరల్ అవుతోంది.. ఈ విషయాన్ని ఆమె చింతూరులో కార్యకర్తలు తమ కేడర్ పాల్గొన్న సమావేశంలో వెల్లడించారు. ఎటపాక మండలం రాజుపేటకు చెందిన సుజాత ఏడాది క్రితం వైసీపీలో చేరి పార్టీ కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. కాని ఇక్కడ ఆమెకు టికెట్ ఇవ్వకుండా ధనలక్ష్మికి ఇవ్వడంతో వీరి వర్గం కూడా ఆమెకు సపోర్ట్ చేయను అంటున్నారు.. ఈ సమయంలో సంవత్సరం నుంచి పార్టీకి కోడి సుజాత సపోర్ట్ గా ఉన్నారు. అందుకే రెబల్ గా పోటీలో ఉండాలి అని చెబుతున్నారు ఇక్కడ కేడర్ .మరి వైసీపీ శ్రేణులు ఎలాంటి పోటిని ఇక్కడ ఎదుర్కొంటారో చూడాలి.