ర‌ష్యా వ్యాక్సిన్ కావాలి అని కోరుతున్న దేశాలు ఇవే ? మరి మ‌న దేశం ఉందా?

ర‌ష్యా వ్యాక్సిన్ కావాలి అని కోరుతున్న దేశాలు ఇవే ? మరి మ‌న దేశం ఉందా?

0
151

ర‌ష్యా వ్యాక్సిన్ ని ప్ర‌వేశ పెట్టింది, దీనిపై అధ్య‌క్షుడు పుతిన్ ప్ర‌క‌ట‌న చేశారు, ఆయ‌న కుమార్తెకు కూడా ఓ టీకా ఇచ్చారు, దీని ప‌నితీరు బాగుంది అని తెలియ‌చేశారు.. అయితే చాలా మంది నిపుణులు ఇంకా స‌రైన ట్ర‌య‌ల్స్ చేయ‌కుండా ర‌ష్యా దీనిని బ‌య‌ట‌కు వ‌దిలింది అని ఆరోప‌ణ‌లు చేస్తున్నారు.

ఈ స‌మ‌యంలో రష్యాపై నమ్మకంతో ఈ వ్యాక్సిన్ ను తమకు అందించాలని ఇండియా సహా 20 దేశాలు కోరాయి. ఈ విషయాన్ని రష్యా స్వయంగా ఓ ప్రకటనలో పేర్కొంది. ఇండియా, యూఏఈ, సౌదీ అరేబియా, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, బ్రెజిల్, మెక్సికో, టర్కీ, క్యూబా తదితర దేశాలు ఉన్నాయి.

ర‌ష్యా త‌యారు చేసిన స్పుత్నిక్ వీవ్యాక్సిన్ ను ఈ దేశాలు కోరాయని ఓ ప్రకటనలో తెలిపింది ర‌ష్యా. . అయితే ర‌ష్యాలో ఇది ప్ర‌యోగాత్మ‌కంగా ముందు అంద‌రికి ఇస్తున్నారు, ఇది పూర్తి అయిన త‌ర్వాత వ‌చ్చే నెల నుచి ఇత‌ర దేశాల‌కు ఇవ్వ‌నున్నారు, నేడు రెండు వేల మంది ర‌ష్య‌న్ ప్ర‌జ‌ల‌కు ఇది ఇవ్వ‌నున్నారు, సెప్టెంబర్ లో వ్యాక్సిన్ తయారీని భారీ ఎత్తున ప్రారంభించి, ఈ ఏడాది చివరకు 20 కోట్ల డోస్ లను తయారు చేసి అందించాలని ర‌ష్యా భావిస్తోంది.