నాని వి సినిమాకి అమెజాన్ భారీ ఆఫర్ – మ‌రి ఎప్పుడంటే?

నాని వి సినిమాకి అమెజాన్ భారీ ఆఫర్ - మ‌రి ఎప్పుడంటే?

0
125

మార్చి నెల చివ‌రి వారం నుంచి సినిమాలు విడుద‌ల లేదు.. థియేట‌ర్లు తెర‌చుకోలేదు, అయితే వ‌చ్చే నెల అంటే సెప్టెంబ‌ర్ లో అయినా థియేట‌ర్లు తెరుస్తారా అంటే అది అనుమానంగానే ఉంది, అయితే సెట్స్ పై ఉన్న సినిమాల సంగ‌తి అలా ఉంచితే అవి షూటింగ్ ఆపేశారు.

ఇక షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్దంగా ఉన్న సినిమా నిర్మాత‌ల‌కు ఇప్పుడు పెను స‌మ‌స్య‌, ఓ ప‌క్క నిర్మాత‌ల‌కు ఇది చాలా ఇబ్బందిక‌ర ప‌రిస్దితి అని చెప్పాలి, ఒక‌వేళ థియేట‌ర్లు ఓపెన్ అయినా శ‌ని ఆదివారాలు మాత్ర‌మే క‌లెక్ష‌న్లు ఉంటాయి అంటున్నారు ఎక్స్ ప‌ర్ట్ .

ఈ స‌మ‌యంలో ఓటీటీకి మంచి డిమాండ్ ఏర్ప‌డింది, అయితే తాజాగా దిల్ రాజు నిర్మాతగా నాని నటించిన 25వ చిత్రం వి విడుద‌ల‌కు సిద్దంగా ఉంది, కాని థియేట‌ర్లు ఓపెన్ కావ‌డం లేదు, ఈ స‌మ‌యంలో
అమెజాన్ ప్రైమ్ నుంచి భారీ ఆఫర్ వ‌చ్చింద‌ట‌, తాజాగా దిల్ రాజు, సినిమాను ఓటీటీలో విడుదల చేసేందుకు అంగీకరించారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అన్నీ సెట్ అయితే ఈ చిత్రం సెప్టెంబ‌ర్ లో విడుద‌ల అవుతుంది అంటున్నారు. మ‌రి చూడాలి దీనిపై ఇంకా చిత్ర యూనిట్ ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.