వచ్చిన ప్రతీ అవకాశంతో సినిమా చేయదు నయనతార.. కథ కథనం పాత్ర అన్నీ నచ్చితేనే సినిమాకి ఎస్ చెబుతుంది, అయితే ఆమెకి ఓ సినిమాకి భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినా రిజక్ట్ చేసిందట, తాజాగా టాలీవుడ్ లో ఇదే టాక్ నడుస్తోంది.
హిందీలో సంచలన విజయాన్ని నమోదు చేసిన అంధాధూన్ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నారు. ఈ సినిమాలో హీరోగా నితిన్ నటిస్తున్నారు,తెలుగులో మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రీమేక్ చేస్తున్నారు.
ఇక హిందీలో టబు చేసిన క్యారెక్టర్ను తెలుగులో నయనతార చేస్తున్నట్టు ప్రచారం జరిగింది.
అయితే ఆమెకి భారీ పారితోషికం ఆఫర్ చేశారట, అయితే ఈ చిత్రానికి నయన నో చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి, అయితే ఈ చిత్రంలో కాస్త బోల్డ్ గా నటించాలి సో అందుకే ఆమె నో అని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.