జపాన్ పాలనలో ఉండేది ముందు నుంచి ఉమ్మడి కొరియా దేశం… 1910 నుంచి ఉమ్మడి కొరియాపై జపాన్ అధికారం చలాయించింది. వారు కూడా స్వతంత్య్రం కోసం పోరాటం చేశారు, అయితే
1945లో స్వాతంత్ర్యం పొందింది కొరియా.
అయితే రెండో ప్రపంచయుద్దం సమయంలోనే యూఎస్, సోవియేట్ ఆర్మీలతో కలిసి జపాన్పై కొరియా పోరాడింది. ఈ సమయంలో రెండో వరల్డ్ వార్ లో జపాన్ ఓడింది, దీంతో 1945 ఆగస్టు 15న మిత్ర రాజ్యాలకు లొంగిపోతున్నట్లు అప్పటి జపాన్ చక్రవర్తి హిరోహిటో ప్రకటించారు.
ఇక కొరియాపై జపాన్ పెత్తనానికి పుల్ స్టాప్ పడింది.అదే రోజున కొరియా స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. అయితే మూడేళ్ల తర్వాత 1948లో కొరియా రెండు దేశాలుగా విడిపోయింది. యూస్కి అనుకూలంగా దక్షిణ కొరియా.. సోవియేట్కు అనుకూలంగా ఉత్తర కొరియా ఏర్పడ్డాయి. అలా రెండు దేశాలు ఎవరి పాలన వారు చేసుకుంటున్నారు.