బ్రేకింగ్- రైల్వే ప్రయాణికులకు భారీ షాక్- కొత్త చార్జీలు ఎవరికంటే

బ్రేకింగ్- రైల్వే ప్రయాణికులకు భారీ షాక్- కొత్త చార్జీలు ఎవరికంటే

0
77

మన దేశంలో ఎక్కువ మంది జనం ప్రయాణం చేసేది రైలు ప్రయాణం అనే చెప్పాలి , నిత్యం లక్షలాది మంది రైలు ప్రయాణం చేస్తారు, అయితే అన్నీ దేశాలలో కంటే మన దేశంలో అతి తక్కువ ధరకే రైలు ప్రయాణం ఉంది అని చెప్పాలి, అయితే తాజాగా రైలు ప్రయాణం చేసే వారు ఈ కొత్త విషయ తెలుసుకోవాలి, అది ఏమిటి అంటే.

రైల్వే ప్రయాణికులు ప్యాసింజర్ యూసేజ్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుందని ఇండియన్ రైల్వేస్ స్టేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తెలియజేసింది. కాని దేశంలో అన్నీ స్టేషన్లకు ఇది వర్తించదు, కేవలం
రీ డెవలప్మెంట్ చేసిన మోడ్రన్ రైల్వే స్టేషన్లలో ఈ చార్జీలు వసూలు చేస్తారు.

ఇలాంటి స్టేషన్లలో ట్రైన్ టికెట్లు కొనుగోలు చేసే వారికి ప్యాసింజర్ యూసేజ్ చార్జీలు పడతాయి. ఇక మీరు తీసుకున్న టికెట్ ధరలోనే ఈ కొత్త చార్జీలు కూడా కలిపి తీసుకుంటారు, రీడెవలపింగ్ ప్రైవేట్ యూనిట్లు ఈ చార్జీలు వసూలు చేస్తారు. అయితే స్టేషన్లకు వచ్చే ప్రయాణికుల సంఖ్య ప్రకారం ఈ చార్జీలు ఉంటాయి అని అధికారులు చెబుతున్నారు, మరి ఇవి ఎప్పటి నుంచి అమలు, ఎంత చార్జీలు అనేది ఇంకా తెలియాల్సి ఉంది.