అనకొండలు మనుషులను మింగగలవా? భయంకరమైన నిజాలు

అనకొండలు మనుషులను మింగగలవా? భయంకరమైన నిజాలు

0
37

అనకొండ మనం సినిమాల్లో చూసి వామ్మో పెద్ద పైథాన్ పాము అని భయపడతాం, అయితే 10 లేదా 15 అడుగుల అనకొండలు మనం చూస్తాం, అలాగే వాటిని జూలో కూడా మనం చాలా సార్లు పరిశీలింంచాం, కాని నిజంగా సినిమాలో చూపించినట్లు అంత పెద్దగా మనిషిని మింగేలా ఉంటాయా అంటే? పలు పరిశోధనల ప్రకారం అలా చేయవు అంటున్నారు నిపుణులు.

అనకొండలు పైథాన్ లు పెద్ద పెద్ద జంతువులని కూడా మింగలేవు, కేవలం చిన్న చిన్న జంతువులు పక్షులని మాత్రమే తింటాయి, ఇక మనుషుల్ని అమాంతం మింగలేవని, ఇది సినిమాలకు మాత్రమే పరిమితం అంటున్నారు.

చిన్నపాటి మనుషులను అంటే చిన్న పిల్లలను మింగే సామర్థ్యం కలిగి ఉన్న పాములు ఉన్నాయి, అవి రెండు రకాలు ఒకటి గ్రీన్ అనకొండ. మరొకటి రెటిక్యులేటెడ్ పైథాన్, చిన్న పిల్లలు మరుగుజ్జులని చంపేస్తాయి అని చెబుతున్నారు.. 5 అడుగుల మనిషిని అనకొండ మింగింది అనే దృవీకరణలు లేవు అంటున్నారు నిపుణులు, కాని ఈ రెండు రకాల పాములు అమెజాన్ లాంటి దట్టమైన అడవుల్లో ఉంటాయి.
ప్రకృతిలో కలిసిపోయిన రంగుతో ఉంటాయి అని చెబుతున్నారు. ముఖ్యంగా జంతువులని చంపే ముందు వాటిని చుట్టుకుని టైట్ చేస్తాయి, ఇలా చేయడం వల్ల వాటి నరాలు ఎముకలు విరిగి ఆ జంతువులు చనిపోతాయి అప్పుడు మెల్లిగా మింగేసే ప్రయత్నం చేస్తాయి, మనుషులపై సినిమాల్లో మినహా బయట ఇలా జరగలేదు అని చెబుతున్నారు ఏడీఎం నిపుణులు.