చైతూ కోసం భారీగా రేటు తగ్గించుకున్న రకుల్…

చైతూ కోసం భారీగా రేటు తగ్గించుకున్న రకుల్...

0
87

పంజాబ్ నుంచి వచ్చి హైదరాబాద్ లో సెటిల్ అయిన రకుల్ ప్రీత్ సింగ్ లాక్ డౌన్ టైమ్ లో క్రేజీ ఆఫర్ ను కొట్టేసిందని ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి… ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి… ఆ తర్వాత నెమ్మిదిగా అవకాశాలు తక్కువ అయ్యాయి… దీంతో అడపాదడపా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటోంది పంజాబ్ బ్యూటీ…

ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రకుల్ ఇప్పుడు మరో సినిమాకు కూడా ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి… విక్రమ్ కుమార్ నాగచైతన్య కాంబోలో ఒక సినిమా రాబోతోంది… కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత ఈ చిత్రం గురించి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది… అయితే ఈ చిత్రంలో చైతూకు జోడీగా రకుల్ ను తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి…

అంతేకాదు తన రెమ్యూనరేషన్ ని కూడా 25 శాతం తగ్గించుకుంటానని చెప్పిందట… దీంతో రకుల్ నే తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.. కాగా చైతూతో రకుల్ రారండోయ్ వేడుకచూద్దాంలో నటించింది… ఈ చిత్రం మంచి హిట్ ను సంపాదించిపెట్టింది…