చిత్తూరులో చంద్రబాబు మరో కొత్త టెన్షన్….

చిత్తూరులో చంద్రబాబు మరో కొత్త టెన్షన్....

0
36

2019 ఎన్నికల సమయంలో తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు కుమారులు… ముఖ్యంగా టీడీపీలో ఉన్న సీనియర్ నేతల కుమారులు ఎక్కువమంది పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు… కానీ చాలా చోట్ల జగన్ సునామిలో కొట్టుకుపోయారు… ఇక పార్టీ కూడా అధికారం కోల్పోవడంతో వారసులు సొంతపనులకే పరిమితం అయ్యారని వార్తలు వస్తున్నాయి… ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజల మధ్యే ఉండి రాజకీయం చేశారు ఆ తరం కానీ నేటి యువతరం మాత్రం అధికారం ఉంటేనే రాజకీయం ఉంటుందని అంటున్నారు..

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నుంచి గోపాల కృష్ణా రెడ్డి అనేక సార్లు ప్రాతినిధ్యం వహించారు… ఆయన శ్రీకాళహస్తిని టీడీపీ కంచుకోటగా మలుచుకున్నారు… మంత్రిగా కూడా అనేక సార్లు ప్రజా సేవ చేశారు ఆయన… అయితే 2019 ఎన్నికల్లో అనారోగ్యంతో ఉండటంతో ఆయన కుమారుడు సుధీర్ రెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు.. కానీ ఆయన గెలవలేకపోయారు…ఇక అప్పటినుంచి ఆయన ఇంటికే పరిమితం అయ్యారు…

నియోజకవర్గాన్ని అస్సలు పట్టించుకోవడంలేదు… దీంతో కింద స్థాయి క్యాడర్ మొత్తం వైసీపీలోకి జంప్ చేస్తుంది.. ఇక ఇదే జిల్లాకు చెందిన నగరి సెగ్మెంట్ టీడీపీ పరిస్థితి కూడా ఇలాగే ఉందని చర్చించుకుంటున్నారు.. తన తండ్రి గాలిముద్దుకృష్ణమ నాయుడు వారసత్వాన్ని అందిపుచ్చుకున్న కుమారులు నగరిలో పోటీ చేసి ఓటమి చెందారు.. ఆతర్వాత నుంచి వీరు ఇంటికే పరిమితం అయ్యారు… నేటి యువతరం ఇలా కంటిన్యూ చేస్తే పార్టీ పరిస్థితి దారుణంగా తయారు అవుతుందని అంటున్నారు…