సీమలో తమ్ముళ్ళు తలోదారు…

సీమలో తమ్ముళ్ళు తలోదారు...

0
35

రాయలసీమ రాజకీయాల గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరంలేదు… గల్లీ నుంచి ఢిల్లీదాక ఈ ప్రాంతానికి చెందిన నేతలు రాజకీయాలు చేశారు… చిన్న విషయాన్ని పెద్దగా సౌండ్ చేసి రాజకీయాలను వేడి పుట్టించే సీమ నేతలు ఇప్పుడు సైలెంట్ అయ్యారు… ముఖ్యంగా టీడీపీకి చెందిన నేతలు సైలెంట్ అయ్యారు… వారు మూడు రాజధానులు విషయంలో పెదవి విప్పకున్నారు…

పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అమరావతి రాజధానిగా ఉంచాలని డిమాండ్ చేస్తుంటే సీమ తమ్ముళ్లు మాత్రం ఈ విషయంలో పెదవి విప్పకున్నారు… మూడు రాజధానులపై మీడియా సాక్షిగి తమ్ముళ్లు నిప్పులు చెరుగుతుంటే సీమ నేతలు మాత్రం పెదవి విప్పకున్నారు… నిజానికి సీమలో టీడీపీ పరిస్థితి ఏమాత్రం బాగోలేదు… గత ఎన్నికల్లో టీడీపీ కేవలం మూడు సీట్లను మాత్రమే గెలుచుకుంది…

అనేక విషయాలపై స్పందించే టీడీపీ నేతలు మూడు రాజధానుల విషయంలో మాత్రం స్పందించకున్నారు… కర్నూల్ కు న్యాయరాజధాని వస్తే ఎంతో కొంత ఈ ప్రాంతం అభివృద్ది చెందుతుందని తమ్ముళ్లు భావిస్తున్నారు… నిజానికి కేఈ వంటి వారు హైకోర్టును కర్నూల్ జిల్లాలో ఏర్పాటు చేయాలని అప్పట్లో చంద్రబాబు నాయుడుకు చెప్పారు.. కానీ ఆయన అమరావతిలోనే హోకోర్టు నిర్మించారు… ఇప్పుడు న్యాయరాజధానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తే రాజకీయంగా దెబ్బతింటామని తమ్ముళ్లు భావిస్తున్నారు… అందుకే సీమటీడీపీ నేతలు త్రీ క్యాపిటల్ పై పెదవి విప్పకున్నారని అంటున్నారు…