తెలుగుదేశం పార్టీ నుంచి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఎక్కువ అవుతున్నాయి… ఇప్పటికే చాలామంది తమ్ముళ్లు సైకిల్ ను దిగి హాయిగా ఫ్యాన్ కింద రెస్ట్ తీసుకుంటున్నారు… ఇక ఇదే క్రమంలో కడప జిల్లాకు చెందిన టీడీపీ కీలక నేత కూడా వైసీపీలో చేరేందుకు సిద్దమయ్యారు…
కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీర శివారెడ్డి వైసీపీలో చేరేందుకు సిద్దమయ్యారు… ఇప్పటికే జిల్లాకు చెందిన టీడీపీ నేతలు ఇతర పార్టీల్లోకి జంప్ చేశారు… ఇదే క్రమంలో వీరశివారెడ్డి కూడా వైసీపీలో చేరేందుకు సిద్దమయ్యారు… 2019 ఎన్నికల్లో వీర శివారెడ్డి కమలాపురం టికెట్ ను ఆశించారు… కానీ ఆయనకు దక్కలేదు.. కనీసం ప్రొద్దుటూరు టికెట్ అయినా ఇవ్వాలని కోరారు అది కూడా నెరవేరలేదు…
దీంతో వీరశివారెడ్డి ఆయనంతట ఆయనే పార్టీకి దూరంగా ఉన్నారు… ఈ క్రమంలో ఆయన వైసీపీలో చేరేందుకు సిద్దమయ్యారని వార్తలు వస్తున్నాయి… అయితే ఆయన రాకకు కొంతమంది వ్యతిరేకిస్తున్నారు.. పైగా ఇక్కడ సీఎం జగన్ మామ రవి రెడ్డి ఉన్నారు… ఇక్కడ ఆయనకు కలిసి వచ్చేలా లేదని చర్చించుకుంటున్నారు… దీంతో ఆయన బీజేపీలో చేరేందుకు సిద్దమయ్యారని వార్తలు వస్తున్నారు…