బాహుబలి చిత్రం తర్వాత దర్శకుడు రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు… ఈ చిత్రంలో ఇద్దరు స్టార్ హీరోలు రామ్ చరణ్ అలాగే ఎన్టీఆర్ నటిస్తున్నారు…. అన్ని సవ్యంగా జరిగివుంటే వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా ప్రేక్షకుల ముందు వచ్చేది.. కానీ కరోనా కారణంగా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఆగిపోయింది…
ఇప్పటికీ కరోనా విజృంభన కొనసాగుతూనే ఉంది… దీంతో చిత్ర యూనిట్ ఏం చేయాలనే దానిపై ఆలోచిస్తోందట.. ఈ క్రమంలో చిత్ర యూనిట్ కు మెరుపులాంటి ఆలోచన వచ్చిందట… ప్రస్తుతం కరోనా వైరస్ కొన్ని దేశాల్లో నిమ్మదించింది…
న్యూజిలాండ్ వంటి దేశాల్లో అస్సులు కరోనానే లేదు… ఇప్పుడు అలాంటి దేశాల్లో ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ చేయాలని చూస్తోందని ఫిలిమ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది… సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్త ఎంత వరకు నిజమో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే…