కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది… ఈ మాయదారి మహమ్మారిని అరికట్టేందుకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటుంటే మరోవైపు సైంటిస్ట్ లు వ్యాక్సిన్ కనుగొనే పనిలో పడ్డారు… ఈ క్రమంలోనే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హార్షవర్దన్ కీలక ప్రకటన చేశారు…
ఈ ఏడాది చివర్లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.. ఐసీఎంఆర్ తో కలిసి భారత్ బయోటెక్ అభివృద్ది చేస్తున్న వ్యాక్సిన్ ఈ ఏడాదిలోపు రావచ్చని తెలిపారు… కరోనా వ్యాక్సిన్ తయారిలో భారత్ పెద్ద పాత్ర పోషిస్తోందని తెలిపారు.. సురక్షిత వ్యాక్సిన్ తోపాటు అవసరమైన ధరలకే దానిని ప్రజలకు అందించే దిశగా ఆయా కంపెనీలు పని చేస్తున్నాయని స్పష్టం చేశారు…
మరోవైపు వ్యాక్సిన్ తయారిలో భారత్ సక్సెస్ అవుతుందని రష్యా పేర్కొంది… ఆ సత్తా భారత్ కు ఉందని తెలిపింది… కాగా స్పుత్నిక్ వీ పేరుతో రష్యా తొలి కరోనా వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే…