టీడీపీని దెబ్బకొట్టేందుకు ఏపీ బీజేపీలో కీలక మార్పులు…

టీడీపీని దెబ్బకొట్టేందుకు ఏపీ బీజేపీలో కీలక మార్పులు...

0
122

ఏపీ బీజేపీలో పలు మార్పులకు సిద్దమవుతోందా అంటే అవుననే వార్తలు వస్తున్నాయి…ఇందులో భాగంగా ఇప్పటికే యార్టివ్ గా ఉన్న పులువురు నేతలకు అవకాశాలు కల్పిస్తూ 2024 నాటికి రాష్ట్రంలో బీజేపీని బలమైన పార్టీగా మర్చేందుకు వీలుగా రాష్ట్ర కమిటీ ఎంపికకు సిద్దమైంది…

కమిటీ ఎంపికలో పనితీరుతో పాటు జిల్లాల వారిగా అవకాశాలకు పెద్ద పీట వేయనున్నట్లు తెలుస్తోంది… ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అశావాహుల జాబితాతో ఢిల్లీకి చేరుకున్నారు.. ఆయన పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమావేశంలో తుది జాబితా ఖరారు చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి…

ముఖ్యంగా గతంలో టీడీపీకి తోకపార్టీ గా వచ్చిన చెడ్డ పేరును పోగొట్టుకునేలా స్వేచ్ఛగా పనిచేసేలా అవకాశం కల్పించాలని అధిష్టానం ఆలోచిస్తోందట… దీంతో ఈ సారి రాష్ట్ర కమిటీ ఎంపిక ఆసక్తికరంగా మారింది… రాష్ట్ర కమిటీలో సీనియర్లతో పాటు యువకులకు కూడా అవకాశం దక్కనుందని తెలుస్తోంది…