మనసుని హత్తుకునే ఘటన ఇది – తండ్రి కూతురు బంధమంటే ఇదే

మనసుని హత్తుకునే ఘటన ఇది - తండ్రి కూతురు బంధమంటే ఇదే

0
142

రామలింగేశం స్కూల్ టీచర్ గా పనిచేసేవాడు, అయితే అతనికి పెద్దలు కుదిర్చిన వివాహం జరిగింది, ఈ సమయంలో భార్య పద్దతి ముందు బాగానే ఉన్నా కొందరితో అనైతిక సంబంధం పెట్టుకుంది. ఇది తట్టుకోలేక పెళ్లి అయిన ఐదేళ్లకు భార్యని వదిలేశాడు, అయితే ఈలోగా అతనికి ఆమెకి ఓ కుమార్తె పుట్టింది.

ఆమెని అప్పుడు అప్పుడూ కలిసేవాడు, తర్వాత తల్లి మాత్రం తండ్రి దగ్గరకు వెళ్లద్దు అని చెప్పడంతో కుమార్తె కూడా తండ్రిని కలవలేదు, ఈ సమయంలో ఆమెకు ఓ మంచి సంబంధం వచ్చింది, కాని మీ తండ్రి ఏడి కచ్చితంగా వచ్చి కాళ్లు కడగాలి అని అత్తవారింటి వారు అనడంతో.

కుమార్తె తండ్రి ఇంటికి వెళ్లింది, అమ్మ చేసిన తప్పుకి నాకు శిక్ష వద్దు నాన్న నువ్వే నా పెళ్లి దగ్గర ఉండి చెయ్ అని కన్నీరు పెట్టుకుంది, ఆ కూతురు బాధ చూడలేక ఆ తండ్రి పెద్దగా వెళ్లి అల్లుడు కాళ్లు కడిగి కన్యాధానం చేశాడు, ఈ ఘటన అక్కడ వారిని కుటుంబ సభ్యులని కంటతడి పెట్టించింది, అయితే అతను మాత్రం అప్పటి నుంచి వివాహం చేసుకోలేదు.. భార్య చేసిన మోసానికి ఒంటరిగానే ఉన్నాడు, వివాహం అయిన తర్వాత ఆమెని అత్తవారింటికి పంపి తన ఇంటికి అతను వెళ్లిపోయాడు, నిజంగా కుతురు కోరడం తండ్రి అలా వచ్చి కన్యాధానం చేయడం అందరికి బాగా నచ్చింది.