ఓపక్క ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ మరో పక్క జనసేన ఇద్దరు కలిసి మూకుమ్మడిగా జగన్ పై విమర్శలు చేస్తున్నారు.. ఇద్దరూ కూడా జగన్ పై విమర్శలు చేస్తుంటే జగన్ మాత్రం తాను ప్రజలకు ఏమి చేస్తాను అనేది చెబుతున్నారు సీఎంగా అయితే ప్రజల కష్టాలు తీరుస్తా మీ సమస్యలు తీరుస్తా అని చెబుతున్నారు.. ఈ సమయంలో ఎన్నికల ప్రచారాల్లో పలు సంచలన హామీలు కూడా ఇప్పుడు చర్చకు వస్తున్నాయి.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏర్పాటయ్యే ప్రభుత్వంలో మొట్ట మొదటి మంత్రి పదవిని చిలకలూరిపేట వైసీపీ నేత మర్రి రాజశేఖర్కు కేటాయిస్తానని వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు.. ఇప్పుడు ఇదే పెద్ద సంచనలం అయింది. అసలు ఆయనకు చిలకలూరిపేట ఎమ్మెల్యే ఇవ్వలేదు.. మరి మంత్రి పదవి ఎలా ఇస్తారు అని అంటున్నారు.. అలాగే ఇది వైసీపీ నేతలు కూడా అడుగుతున్న ప్రశ్న. కాని ఆయన మాత్రం వైసీపీ శ్రేణులతో చెప్పారట, రాజశేఖర్ తన సీటు వదిలి విడదల రజనీకి ఇచ్చారు. తను నన్ను నమ్మి పార్టీలో కొనసాగుతున్నారు. అందుకే ఆయనకు కచ్చితంగా ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేస్తాను అని చెప్పారట. దీంతో వైసీపీ కేడర్ ఆనందంలో ఉన్నారు. ఈ హామీ రాజశేఖర్ కు ఇవ్వడంతో అందరూ కూడా ఆశ్చర్యపోయారు. జగన్ ని నమ్ముకని ఉంటే ఆయన ఎలాంటి పదవులు ఇస్తారు అనడానికి ఇలాంటి హామీ చాలు అంటున్నారు నాయకులు.