మరో వివాదంలో చిక్కుకున్న జగన్

మరో వివాదంలో చిక్కుకున్న జగన్

0
78

ఎన్నికల వేళ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత విమర్శలు ఇప్పుడు ఏపీలో హీట్ పుట్టిస్తున్నాయి.. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీకి ఇలాంటి విమర్శలు గట్టి షాక్ ఇస్తున్నాయి అని చెప్పాలి.ఎన్నికలు సమీపిస్తున్న వేళ విపక్షనేత జగన్ మరో సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. దీనికి వైసీపీ నాయకులు షాక్ అయ్యారు.. మరి ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం..కేసీఆర్ మద్దతు తీసుకుంటే తప్పు ఏమిటి అని జగన్ అన్నారు.. ఎన్నికల సమయంలో కేసీఆర్ సపోర్ట్ తీసుకోవడం లేదు అని ఓ పక్క వైసీపీ నేతలు మీడియా ముఖంగా చెబుతున్నారు. తమకు కేసీఆర్ ఏమీ సపోర్ట్ చేయడం లేదు అని చెబుతున్నారు. మరో పక్క జగన్ ఇలాంటి స్టేట్ మెంట్ ఇవ్వడంతో డైలమాలో మొత్తం కేడర్ పడిపోయింది.

కేసీఆర్ మద్దతు ఇచ్చేది ప్రత్యేక హోదాకా? లేక వైసీపీకా? అంటూ ప్రశ్నించిన జగన్.. ఫెడరల్ ఫ్రంట్తో కేంద్రంపై ఒత్తిడి పెంచి రాష్ట్ర సమస్యలు పరిష్కరించుకోవచ్చని అన్నారు. దీనిపై తెలుగుదేశం నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు ..జగన్ కేసీఆర్ తో ఒప్పందం చేసుకుని ఏపీని తెలంగాణకు తాకట్టు పెడుతున్నాడు అని విమర్శిస్తున్నారు.