రజిని కొత్త సినిమా సంచలన దర్శకుడితో

రజిని కొత్త సినిమా సంచలన దర్శకుడితో

0
58

తలైవా సినిమా వస్తోంది అంటే ఎక్కడా లేని జోష్ కనిపిస్తుంది అభిమానులకి …సౌత్ ఇండియాలో సూపర్ స్టార్ గా ఆయన పేరు సంపాదించారు. ఇక ఆయన సినిమాలకి ఇండియాలో ఓ క్రేజ్ అని చెప్పాలి, ఆ మ్యానరిజం బాలీవుడ్ హీరోలకు కూడా రాదు. దటీజ్ రజినీకాంత్
తాజాగా ఆయన 166 వచిత్రాన్ని ఏఆర్ మురుగదాస్ డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా గురించి ఎలాంటి అప్ డేట్ వస్తుంది అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

అయితే తాజాగా ఈసినిమా గురించి అప్ డేట్ వచ్చింది ..ఈ సినిమాని ఏప్రిల్ 10 నుంచి స్టార్ చేయనున్నారు అని తెలుస్తోంది.. ఇక ఇందులో రజినికి నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో పోలీస్ ఆఫీసర్ గా తలైవా నటించనున్నారు. ఇక ఈ సినిమాకి మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తున్న అనిరుద్ బాణీలు సమకూరుస్తున్నారు. వీరిద్దరి కాంబోలో రానున్న ఈ చిత్రం పై కోలీవుడ్ లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని డిసెంబరులో విడుదల చేయాలి అని ఈ ఏడాది కచ్చితంగా ఎట్టి పరిస్దితుల్లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట.