మరోసారి జగన్ పరువు తీసేసిన వంగవీటి రాధా

మరోసారి జగన్ పరువు తీసేసిన వంగవీటి రాధా

0
58

జగన్ తనని పార్టీలో చాలా అవమానించాడు అని తన సత్తా ఏమిటో జగన్ కు చూపిస్తా అని పార్టీ నుంచి బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరారు వంగవీటి రాధా, అయితే రాధా పార్టీలో చేరడంతో తెలుగుదేశం పార్టీకి ఎంతో మైలేజ్ వచ్చింది. కాపులు మరింత దగ్గర అయ్యారు. ఇక తెలుగుదేశం ఎన్నికల సమయంలో స్టార్ క్యాంపెయినర్ గా కూడా రాధా పేరు చేర్చారు. ఇక ఎన్నికల ప్రచారం కూడా స్టార్ట్ చేశారు రాధా. అయితే ఈ సమయంలో తెలుగుదేశం పార్టీకి మరింత ఉపయుక్తం అవుతారు అని టాక్ నడిచింది, ఇప్పుడు ఇదే పస్ల్ అయ్యేలా కనిపిస్తోంది. ముఖ్యంగా కాపులను యువతను ఆయన తెలుగుదేశం పార్టీకి మరింత దగ్గరకు చేస్తున్నారు.

ఈ సమయంలో జగన్పై టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాపుల శ్రేయస్సు కోసం మాట్లాడుతానంటే జగన్ వద్దన్నారని రాధా తెలిపారు. జగన్ కాపులకు ఎలాంటి హామీ సరైనది ఇవ్వలేదు అని కాపులకు ఎలాంటి ప్రయోజనం వైసీపీలో ఉండదు అని చెప్పారు ఆయన…కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇవ్వాలని అడిగితే కుదరదన్నారని చెప్పారు. ఎవరికో ముష్టివేసినట్లు రూ.10వేల కోట్లు కాపులకు ఇస్తామన్నారని గుర్తుచేశారు. ఎన్నికల్లో జగన్కు కాపులు తగిన బుద్ధి చెప్పాలని వంగవీటి రాధాకృష్ణ పిలుపునిచ్చారు.దీంతో ఇప్పుడు ఇవి ఏపీ పొలిటికల్ కారిడార్లో చర్చకు వస్తున్నాయి.