మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అలాగే మాజీ మంత్రి దేవినేని ఉమాపైమంత్రి కొడాలినాని సంచలన వ్యాఖ్యలు చేశారు… చంద్రబాబు రైతుల బకాయి పెట్టిన విద్యుత్ బిల్లులను తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెల్లించామని స్పష్టం చేశారు… తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… చంద్రబాబు నాయుడు మాటలను ఎవ్వరు నమ్మొద్దని అన్నారు…
రైతులు ఎంత కరెంటూ వాడినా ప్రభుత్వమే చెల్లిస్తుందని అన్నారు… మీటర్లు బిగిస్తే రైతులకు అన్యాయం జరుగుతుందని చంద్రబాబు ఎల్లో మీడియాలు దుష్ర్పచారం చేస్తోందని ఆరోపించారు… చంద్రబాబు నాయుడు 2024లో అన్నీ ఫ్రీ అంటారని అప్పటికే ఆయన వయస్సు అయిపోతుందని అన్నారు… మైండ్ కూడా పోతుందని అన్నారు…
దీంతో చంద్రబాబు అధికారంలోకి వచ్చేదిలేదు చచ్చేది లేదని అన్నారు… తనను లారీ డ్రైవర్ అని ఉమా అంటున్నారని దేవినేని ఉమా తండ్రి సోడాలు అమ్ముకునేవారని ఆరోపించారు…. ఉమా అప్పుడు సోడాలు కడుక్కునే వారని ఆరోపించారు… తనకు రాజకీయ భిక్షపెట్టింది చంద్రబాబు నాయుడు కాదని స్వర్గీయ ఎన్టీఆర్ అని అన్నారు… వదినని చంపి దేవినేని ఉమా రాజకీయాల్లోకి వచ్చారని ఆరోపించారు..