బ్రేకింగ్… కరోనాతో పాటు ఏపీ మరో వింత వ్యాధి… ముగ్గురు మృతి

బ్రేకింగ్... కరోనాతో పాటు ఏపీ మరో వింత వ్యాధి... ముగ్గురు మృతి

0
93

ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో మరో వింత వ్యాధితో ప్రజలు భయాందోళకు గురి అవుతున్నారు… ఈ సంఘటన విశాఖపట్నం ఏజెన్సీ ధరకొండ పంచాయితీలో జరిగింది… గ్రామంలో వారం రోజుల్లో మూడు మరణాలు సంభవించాయి… శరీరం అంతా వాపుతో మృతి చెందుతున్నారు…

ఈ లక్షణాలు ఉన్న ఒక మహిళ ఇటీవలే ఆసుపత్రికి వెళ్ళింది… అక్కడ డాక్టర్లు ఆమెకు పరీక్షలు చేశారు….ఆమె పరిస్ధితి విశమంగా ఉందని చెప్పడంతో వెంటనే మెరుగైన వైద్యం కోసం చింతపల్లి సీహెచ్ సీకి తరలించారు…అయితే మార్గమద్యమంలో మృతి చెందింది… ఆ తర్వాత ఇద్దరు పిల్లలకు శరీరమంతా వాపులు రావడంతో వారు కూడా మరణించారు…

వారంలోనే ముగ్గురు మరణించడంతో గ్రామస్తులకు ఆందోళకలిగిస్తోంది…. కొద్దికాలంగా అక్కడ భారీగా వర్షాలు పడుతున్నాయి… దీంతో రోడ్లు దెబ్బతిన్నాయి… ఆసుపత్రికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది… వెంటనే అధికారులు స్పందించి ప్రతీ ఒక్కరికి వైద్య పరీక్షలు నిర్వహించాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు…