బాబు లోకేష్ ప్రచారం పై సాయిరెడ్డి పంచ్

బాబు లోకేష్ ప్రచారం పై సాయిరెడ్డి పంచ్

0
87

మొత్తానికి ఏపీలో ఓ పక్క సీఎం చంద్రబాబు మంత్రి నారాలోకేష్ ప్రచారం అదరగొడుతున్నారు అనే అంటున్నారు తెలుగుదేశం నేతలు.. మొత్తానికి ఏప్రిల్ 9న లోకేష్ బాబుకు మంగళగిరిలో ఓటు వేయాలని, అలాగే 25 అసెంబ్లీ స్ధానాలు తెలుగుదేశం గెలవాలి అని బాబు కోరుకుంటున్నారు .. బాబు గారు కూడా 25 అసెంబ్లీ స్ధానాలు గెలవడం చారిత్రాత్మక అవసరం అని చెప్పారు.. ఇక ఇప్పుడు లోకేష్ గురించి పలువురు సీనియర్లు కూడా చెబుతున్నారట ,ఆయన ప్రచారం వద్దు అని ఇదే పెద్ద చర్చ జరుగుతున్న టీడీపీ ఇంటర్నల్ అంశం.

బాబోయ్ మాకొద్దు మీ ( చంద్రబాబు, లోకేశ్, మమతా బెనర్జీల) ప్రచారం. ఒకటి చెప్పబోయి ఇంకోటి అంటుంటే ఓటర్లు నవ్వుకుంటున్నారు. మీ దెబ్బకు ప్రచారం వదిలి జన సమీకరణ చేయాల్సి వస్తోంది’ అని తెలుగుదేశం అభ్యర్థులు వాపోతున్నారని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. బందరు పోర్టు తెలంగాణకు తీసుకువెళ్లడం ఏమిటి అని అంటున్నారు.

టీడీపీ ప్రచారంలో పాల్గొన్న ఎన్సీ నేత ఫరూఖ్ అబ్ధుల్లా గెలుపు అవకాశాలు కనిపించడం లేదని చంద్రబాబుకు ముఖం మీద చెప్పారట కదా…
అసలు ఏమి చేశారు ఈఐదు సంవత్సరాలు మీకు జనం రావడం లేదు అని నేరుగా ఆయన అన్నారట అని విజయసాయిరెడ్డి ప్రశ్నిస్తున్నారు ఇదంతా తెలుగుదేశం నేతలు చర్చించుకుంటున్న విషయం అని సైరా సెటైర్ వేశారు.