అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్షణ స్టార్ చేసిందా అంటే అవుననే సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.. ప్రజా బలం అలాగే వరుసగా విజయాలను సాధిస్తున్న ఎమ్మెల్యేలపై సర్కార్ ఫోకస్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి… విశాఖ పరిపాలన రాజధానిగా ప్రకటించిన తర్వాత నుంచి ఆ జిల్లా ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్నట్లు వర్తలు వస్తున్నాయి…
2019లో హోరా హోరీగా జరిగిన సర్వత్రిక ఎన్నికల్లో అన్నిజిల్లాలో వైసీపీ జెండా రెపరెపలాడింది… కానీ విశాఖలో మాత్రం టీడీపీ నాలుగు సీట్లను గెలుచుకుంది… అందుకే ఈ జిల్లాపై వైసీపీ సర్కార్ ఫోకస్ చేస్తోంది… కీలక నేతలను చేర్చుకుంటోంది…
ఇప్పటికే కొంతమంది నేతలను ఫ్యాన్ చెంతకు చేర్చుకుంది… ఇప్పుడు మాస్ ఫాలోయింగ్ ఉన్న ఒక ఎమ్మెల్యేను వైసీపీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి… అయితే ఆయనను పార్టీలో చేర్చుకునేందుకు ఆ నియోజకవర్గ వైసీపీ నేతలు ఒప్పుకోకున్నారట…మరి చూడాలి వైసీపీ సర్కార్ ఆయన విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో…