ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ తరపున చక్రం తిప్పిన నేతలు చాలా మంది ఉన్నారు… అయితే తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత తెలంగాణలో మినహా ఏపీలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైంది.. దీంతో చాలా మందినేతలు ఇతర పార్టీల్లో చేరిపోయారు.. ఇంకొంతమంది అలాగే ఉండిపోయారు అలా ఉండిపోయిన వారిలో ఒకరు డీఎల్ రంద్రారెడ్డి ఒకరు.. మైదుకూరు నుంచి వరుస విజయాలు సాధించి చరిత్రను సృష్టించారు అప్పట్లో డీఎల్..
అయితే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ పోటీ చేయలేదు ఆయన.. ఇక 2019 ఎన్నికల సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరమని ఎంపీ అవినాష్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వారు ఆయనను కోరారు… వైసీపీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పారు కానీ ఆయన చేరలేదు..
దీంతో ఎన్నికల సమయంలో ఆయన టీడీపీ తీర్థం తీసుకుని టికెట్ ఆశించారు కానీ ఆయనకు సీటు దక్కలేదు… దీంతో 2019లో ఆయన పోటీ చేయలేకపోయారు…. ఇక ఈ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత డీఎల్ జగన్ ను కలువలేదు.. దీంతో ఆయన తనంతట తాను రాజకీయాలనుంచి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి…