మహిళలు చేతికి గాజులు ఎందుకు వేసుకుంటారో తెలుసా

మహిళలు చేతికి గాజులు ఎందుకు వేసుకుంటారో తెలుసా

0
143

మహిళల చేతికి గాజులందము అందుకే ఎన్ని గాజులు వేసుకుంటే అంత అందంగా ఉంటుంది ఉంటారు, ఇక ఫంక్షన్ల సమయంలో వారు ధరించే ఆభరణాలు జిగేల్ మనిపించే ఈ గాజులు ఎంతో అందం తీసుకువస్తాయి.కన్నెపిల్ల చేతికి గాజులిచ్చే అందము మరేది ఇవ్వదు.

గాజులయొక్క ప్రయోజనాలు చాలా ఉన్నాయి, స్త్రీకి రక్షాకంకణం ఈ గాజు అని చెప్పాలి, ముందుగా మహిళల చేతికి ఓ ప్రత్యేక ఆభరణం అదే.. వారి ప్రత్యేక ఆకర్షనకు కారణం అని అంటారు, అప్పుడే పుట్టిన బిడ్డకి నల్లగాజులు వేస్తారు, అవి లేవగానే చూసుకుంటూ ఉంటారు.. ఇక పిల్లలకు దిష్టి తగలకుండా మంచిది అని భావించి మొదట ఆ నల్లగాజులు వేస్తారు.

చేతులతో ఆడిస్తూ ఉంటే చిరుసవ్వడులు చేస్తాయి.ఆడపిల్లలకు జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని జీవితం చాలా విలువైనది అని చెప్పడానికే ..ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. గాజులాగే పగిలిపోతుంది అని అర్ధం..రెండు చేతుల నిండా గాజులేసుకుని, పట్టుపరికిణీ కట్టుకుని.,సాక్షాత్తు లక్ష్మీదేవిలా ఆడపిల్ల ఇంట తిరుగుతూ ఉంటుంది..సౌభాగ్యానికి కూడా చిహ్నంగా చెబుతారు. అమ్మవార్లకు గాజులు వేస్తూ ఉంటారు, అందుకే మహిళలను శక్తి రూపంలో భావించి గాజులు ధరించమని చెబుతారు.