మన పెద్దలు చెబుతూ ఉంటారు నరదృష్టి తగిలితే నాపరాయి నల్లరాయి కూడా పగిలిపోతుంది అని.. ఇది నిజమే, మనం ఒక్కోసారి కొన్ని ఇళ్లల్లో ఇలాంటివి చూస్తూ ఉంటాం, అందుకే ఇంటికి కచ్చితంగా బూడిద గుమ్మడికాయ కడుతూ ఉంటారు.
ఇంటి ముందు దిష్టి నివారణ కొరకు గుమ్మడికాయ కట్డడం అనేది ఏనాటి నుంచో అనాదిగా వస్తోంది..
అనుభవజ్ఞులైన పండితులచే శాస్త్రోకంగా కూశ్మండ పూజ చేయించుకుని ఇంటి ప్రధాన ద్వారం పైన ఉట్టిలో వేలాడదీయండి. ఇలా చేస్తే దానికి ఎంతో శక్తి ఉంటుంది.
ఇక రోజూ కచ్చితంగా అగరబత్తి వెలిగించి దానికి దూపం చూపించాలి.. సాంబ్రాణి వేసిన రోజు కూడా చూపిస్తే చాలా మంచిది.. ఇంట్లోకి వచ్చేటటువంటి నకారాత్మక శక్తిని ఇది నిలువరిస్తుంది, ఇక ఇంట్లో పూజ పురుషుడు చేసి ఆ ఉట్టిలో గుమ్మడికాయ కట్టండి, అలాగే ఇంట్లో మీ తండ్రి ఉంటే ఆయన చేత అయినా కట్టించవచ్చు, పిల్లల చేత ఈ గుమ్మడికాయ కట్టించవద్దు, గర్భిణీ స్త్రీలు కూడా ఈ గుమ్మడికాయ ఉట్టిలో కట్టకూడదు అంటున్నారు పండితులు.
కచ్చితంగా పసుపు కుంకుమ రాసి పూజ చేసి ఈ గుమ్మడికాయ ఉట్టిలో కట్టాలి, ఎట్టి పరిస్దితిలో కట్టే సమయంలో ఇది పగిలితే దానిని మట్టిలో లేదా నీటిలో కలిపేయాలి. మురికి కాలువల్లో రోడ్లపై పడేయకూడదు, కొత్తది అయినా కుళ్లిపోయినది అయినా ఇలా పాడేయ్యకూడదు.