తెలంగాణ సీఎం కెసిఆర్ బీజేపీ కి దీటుగా నయా భారత్ పేరుతో ఓ జాతీయ పార్టీ ని పెడుతున్న విషయం అందరికి తెలిసిందే .. అయితే ఈ విషయం పై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షడు బండి సంజయ్ సంచలన వాక్యాలు చేసారు .
తెలంగాణను అభివృద్ధి చేయటం లో దారుణంగా ఫెయిల్ అయిన కెసిఆర్ జాతీయ పార్టీ పెట్టి ఎవర్ని ఉద్ధరిస్తారంటూ అయన మీడియా వేదికగా స్పందించారు . అక్రమాస్తుల క్రమబద్దీకరణే ద్యేయంగా కెసిఆర్ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని అయన అన్నారు .
ఇప్పటికే మజ్లీస్ పార్టీ తో అయన చేసుకున్న లోపాయకారీ ఒప్పందాల మూలంగా రాష్ట్రం నాశనమైందని , ఇక ఈయన జాతీయ పార్టీ పెడితే దేశాన్ని అమ్మేయడం ఖాయమని ఆయన కెసిఆర్ ను విమర్శించారు . తెలంగాణ ప్రభుత్వ పాలనలో ఇప్పటికే అసంతృప్తిగా ఉన్న ప్రజలు ఈ జాతీయ పార్టీ విషయం లో కెసిఆర్ పై సైలెంట్ గా సెటైర్లు వేస్తున్నట్టు తెలుస్తుంది .