బుల్లితెర సీరియల్స్ లో నటించే నటి కొండపల్లి శ్రావణి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ఎనిమిది సంవత్సరాలుగా సీరియల్స్ లో నటిస్తోంది, అయితే ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తాజాగా తెలుస్తున్నాయి.
ఆమెని ప్రేమ పేరుతో ఓ వ్యక్తి వేధించాడు, దీని వల్ల ఈ దారుణం జరిగింది అని అంటున్నారు.హైదరాబాద్‌లోని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మధుర నగర్‌లో నివసిస్తున్న శ్రావణి బాత్రూంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
వెంటనే గుర్తించిన ఇంటి సభ్యులు ఆమెని ఆస్పత్రికి తీసుకువెళ్లారు కాని ఆమె అప్పటికే మరణించింది, అయితే ఆమెకి టిక్ టాక్ లో కాకినాడ గొల్లప్రోలుకు చెందిన దేవరాజు రెడ్డితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా స్నేహంగా మారింది. అయితే గత కొంతకాలంగా శ్రావణిని దేవరాజ్ రెడ్డి వేధింపులకు గురి చేశాడని తెలుస్తోంది. ఎన్నో సార్లు ఆమె వారించినా అతని ప్రవర్తన మారలేదు, దీంతో ఆమె ఉరివేసుకుని ఆ వేధింపులకి ఆత్మహత్య చేసుకుంది అంటున్నారు కుటుంబ సభ్యులు, అతనిపై కేసు నమోదు చేశారు పోలీసులు.