బ్రేకింగ్- ట్ర‌య‌ల్స్ ఆపేసిన ఆస్ట్రాజెన్‌కా- వ్యాక్సిన్ తీసుకున్న వ్య‌క్తికి ఏమైందంటే

బ్రేకింగ్- ట్ర‌య‌ల్స్ ఆపేసిన ఆస్ట్రాజెన్‌కా- వ్యాక్సిన్ తీసుకున్న వ్య‌క్తికి ఏమైందంటే

0
98

ప్ర‌పంచం అంతా ఎదురుచూస్తోంది, ఈ క‌రోనా వైర‌స్ కి సంబంధించి వ్యాక్సిన్ ఎప్పుడు వ‌స్తుందా అని, అయితే అంద‌రూ కూడా ఈ వ్యాక్సిన్ గురించి ఎదురుచూస్తున్నారు అదే ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ-ఆస్ట్రాజెన్‌కా వ్యాక్సిన్ , ఇప్ప‌టికే మూడో ద‌శ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ కూడా జ‌రుగుతున్నాయి.

అయితే తాజాగా ఈ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ ఆపేశారు, వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి అనారోగ్యానికి గురికావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఓ ప్రకటన జారీచేసింది కంపెనీ. అయితే అత‌నికి ఏ అనారోగ్యం అనేది మాత్రం చెప్ప‌లేదు.

అయితే అత‌నికి అంత‌కుముందు ఏమైనా వ్యాధులు ఉన్నాయా అలా అనేక కోణాల్లో ప‌రిశోధ‌న చేస్తున్నారు..అమెరికా సహా ఇతర దేశాల్లో తాత్కాలికంగా నిలిపివేసినట్టు కంపెనీ తెలిపింది. 30వేల మంది వాలంటీర్లను ఆగస్టు చివరిలో ఆస్ట్రాజెన్‌కా రిక్రూట్ చేసుకుంది. బ్రిటన్, బ్రెజిల్, దక్షిణాఫ్రికాలోనూ వేలాది మంది ముందుకొచ్చారు, అయితే వ‌చ్చే వారం దీనిపై కీల‌క ప్ర‌క‌ట‌న చేయ‌నున్నారు అని అంటున్నారు.