ఆ సెగ్మెంట్ లో దమ్మున్న నేతను దింపుతున్న చంద్రబాబు…

ఆ సెగ్మెంట్ లో దమ్మున్న నేతను దింపుతున్న చంద్రబాబు...

0
81

2019 ఎన్నికల్లో మరోసారి అధికారం దక్కించుకోవాలని బరిలోకి దిగిన తెలుగుదేశంపార్టీ అధికారం కాదు కదా చివరకు ఒక దశలో ప్రతిపక్ష హోదా కూడా దక్కుతుందో లేదో అన్న అనుమానం వచ్చింది కొందరికి… అన్ని జిల్లాల్లో వైసీపీ మెజార్టీ స్థానాలను సాధించుకుని అధికారంలోకి వచ్చింది… టీడీపీ కేవలం 23 స్థానాలను మాత్రమే గెలుచుకుంది…

అందులో ముగ్గురు ఎమ్మెల్యేలు రెబల్ గా మారారు.. అయితే ఈ మూడు సెగ్మెంట్ లలో రెండు సెగ్మెంట్ లలో టీడీపీ ఇంచార్జులు ఉన్నప్పటికీ గన్నవరంలో వల్లభనేని వంశీని ఢీ కొట్టే నాయకులు ఇంతవరకు కనిపించలేదు… ఇప్పటివరకు అక్కడ ఇంచార్జ్ ను నియమించలేదు టీడీపీ…

అయితే తాజా విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వంశీని ఢీ కొట్టేందుకు బలమైన నేతను దింపేందుకు టీడీపీ అధిష్టానం సిద్దమవుతోందని వార్తలు వస్తున్నాయి… గన్నవరంలో ఒక ఎన్నారైను దించనుందని వార్తలు వస్తున్నాయి.. ఆయన అయితే వంశీని ఢీ కొట్టగల సత్తా ఉందని పార్టీ అధిష్టానం అంచనా వేస్తోంది….