భారత్ లో ల్యాప్ ట్యాప్స్ కొరత కారణం ఇదేనా?

భారత్ లో ల్యాప్ ట్యాప్స్ కొరత కారణం ఇదేనా?

0
96

ఈ కరోనా సమయంలో అందరూ ఇంటి పట్టునే ఉంటున్నారు, దీంతో చాలా వరకూ ఆరు నెలలుగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు చాలా మంది ఉద్యోగులు, ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులు 65 శాతం ఇంటి నుంచే ఉద్యోగాలు చేయడంతో స్మార్ట్ వర్క్ కోసం ల్యాప్ ట్యాప్స్ ఎక్కువగా వాడుతున్నారు.

దీంతో భారీగా లక్షల ల్యాప్ ట్యాప్స్ ఈ ఆరు నెలల్లో అమ్ముడు అయ్యాయి,. ఈ పోర్టల్స్ షాపుల్లో మొత్తం చాలా వరకూ ల్యాప్ ట్యాప్స్ అమ్మారు, ఇక సెకండ్ హ్యాండ్ వి కూడా చాలా వరకూ అమ్మకాలు జరిగాయి, అయితే స్కూల్ విద్యార్దులకి కూడా ఇంటి నుంచి చదువు ఆన్ లైన్ క్లాసులు ఉండటంతో వీరికి కూడా కొత్త ల్యాప్ ట్యాప్స్ కొనుగోలు చేస్తున్నారు.

అందుకే వర్క్-ఫ్రమ్-హోమ్, ఆన్లైన్ తరగతుల దృష్ట్యా భారతదేశంలో ల్యాప్టాప్ల కొరత ఏర్పడింది. వీటి తయారీకి అవసరం అయ్యే చిన్న పార్ట్ లు చైనా నుంచి రావాలి.. కాని రెండు దేశాల మధ్య వివాదంతో కొన్ని ఉత్పత్తులు రావడం తగ్గాయి అంటున్నారు వ్యాపారులు. ఇక ఈ సమయంలో ల్యాప్ ట్యాప్స్ ధరలు మాత్రం ఎక్కడా తగ్గించడం లేదు డిస్కౌంట్లు కూడా ఇవ్వడం లేదు.