ఏపీ సర్కార్ సంక్షేమ పథకాల విషయం లో కొన్ని కొన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రజలు మాత్రం సంతృప్తిగానే ఉన్నట్లు తెలుస్తుంది . అయితే జగన్ ముందు ఉన్న మరో ఛాలెంజ్ పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం . త్వరలో జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో ఇదే విషయం పై కేంద్రాన్ని ప్రశ్నించాలని జగన్ వైసీపీ ఎంపీ లకు దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది .
అయితే ఈ సమావేశాలకి ఎంపీ రఘురామకృష్న రాజుకి భేటీకి ఆహ్వానం అందనట్లు తెలుస్తుంది .పార్టీ విమర్శించడమే పనిగా పెట్టుకున్న ఇతనికి ఆహ్వానం అందకపోవడంలో ఆశ్చర్యం లేదని కొందరు చెబుతున్నారు . ఇతని సంగతొయ్ ఎలా ఉన్న మిగతా ఎంపీ లు మాత్రం కేంద్రం పై ప్రశ్నల యుద్దానికి సిద్దమవుతున్నట్లే తెలుస్తుంది .ముక్యంగా పోలవరం ప్రాజెక్టుకి రావాల్సిన నిధుల గురించి , జీఎస్టీ తదితర అంశాలపై కేంద్రం తో చర్చకి సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది . ఇక ఎంపీల వాదనకి కి కేంద్రం నుంచి స్పందన ఎలా ఉంటుందో చూడాలి మరి …