రూ.58వేల కోట్లు దానం చేసిన మ‌హానుభావుడు – ఇప్పుడు చిన్న ఇంటిలో జీవితం ఆయ‌న‌ ఎవ‌రంటే

రూ.58వేల కోట్లు దానం చేసిన మ‌హానుభావుడు - ఇప్పుడు చిన్న ఇంటిలో జీవితం ఆయ‌న‌ ఎవ‌రంటే

0
103

దానం చేయాలి అనే గుణం చాలా త‌క్కువ మందికి ఉంటుంది, అయితే వ‌చ్చిన ఆదాయం సంపాదించిన ఆస్తి మొత్తం దానం చేసేవారు ప‌దుల సంఖ్య‌లో ఉంటారు ఇన్ని కోట్ల‌మందిలో, మ‌రి ఆయ‌న వేల కోట్ల ఆస్తిని మొత్తం దాతృత్వం చేశారు, ఆయ‌న గురించి తెలుసుకుందాం.

ఛార్ల్స్ చక్‌ఫీనీ. విమానాశ్రయాల్లో ఉండే డ్యూటీ ఫ్రీ షాపర్స్‌ సహవ్యవస్థాపకుడు, ఆయ‌న మొత్తం సంపాదించిన ఆస్తి 58 వేల కోట్ల రూపాయ‌లు, అంటే ఓ అతి పెద్ద ఎమ్మెన్సీ కంపెనీ 30ఏళ్ల సంపాద‌న‌..
ఆ ఆస్తి మొత్తం తన స్వచ్ఛంద సంస్థ అట్లాంటిక్‌ ఫిలాంత్రోపీస్‌ ద్వారా దానం చేశారు.

ఇలా దాతృత్వం చేస్తాను అని 2012లో ప్రకటించిన ఫీనీ, ఆ మాటను నిలుపుకున్నారు. పదవీ విరమణ తర్వాత తన భార్యతో కలిసి జీవించేందుకు రూ.14కోట్లనే ఉంచుకుని, మిగిలిన మొత్తాన్ని వివిధ స్వచ్ఛంద సంస్థలకు దానమిచ్చేశారు. ఈనెల‌తో మొత్తం ఆ ఆస్తి అంతా దానం చేశారు, నిజంగా ఆయ‌న‌ని ప్ర‌పంచంలో చాలా మంది ఆద‌ర్శంగా తీసుకున్నారు.బిల్‌ గేట్స్‌, వారెన్‌ బఫెట్‌ ఇద్దరూ తమ దాతృత్వాన్ని చాటుకోవడం వెనుక స్ఫూర్తి ఫీనీయే కార‌ణం అని చెప్పారు, ఆయ‌న బాట‌లోనే వీరు సాగారు.. శాన్‌ఫ్రాన్సిస్కోలో ఒక మామూలు అపార్ట్‌మెంట్‌. తన భార్యతో కలిసిఉంటున్నారు, అక్క‌డ అంద‌రూ ఆయ‌న‌ని ఎంతో గౌర‌విస్తారు.