టీడీపీ లో పార్టీ గురించి ఆలోచించే నేతలు వాళ్లేనా ?

టీడీపీ లో పార్టీ గురించి ఆలోచించే నేతలు వాళ్లేనా ?

0
93

2019 ఎన్నికల్లో టీడీపీ గతం లో ఎన్నడూ చూడని విధంగా ఓటమి చూసింది . ఇక కొద్ద్దిరోజులకే టీడీపీ నుండి వైసీపీ కి వలసలు మొదలయ్యాయి . ఇక టీడీపీ నేతలని వైసీపీ ఒక్కొక్కరిగా టార్గెట్ చెయ్యటం స్టార్ట్ చేసింది .ఎప్పుడైతే అచ్చం నాయుడు ఈఎస్సై మందుల కేసులో అరెస్ట్ అయ్యారో అప్పటి నుంచి టీడీపీ నేతల గుండెల్లో గుబులు మొదలైంది ..

చాల మంది కార్యకర్తలు టీడీపీ కార్యకలాపాలలో పాల్గొనటానికి కూడా ధైర్యం చేయటం లేదు . దెబ్బ తిన్న పార్టీ ని మల్లి బలోపేతం చెయ్యాలన్న ఆలోచన చాల మంది టీడీపీ నేతల్లో కనబడటం లేదు .

అయితే భూమా అఖిలప్రియ , చిత్తూరు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న అమర్నాధరెడ్డి మాత్రమే ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తూ ,జనాల్లో తమ పార్టీ ప్రస్తావన ఉండేలా ప్రయత్నం చేస్తున్నారు . అయితే మిగతా నేతలెవ్వరూ పార్టీ కి సంబందించిన ఏ విషయం పై మాట్లాడకపోవడం పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి …