తెలంగాణ అధికార టీఆర్ఎస్ పార్టీ దుబ్బాక ఎమ్మెల్యే ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే… దీంతో దుబ్బాకలో ఉపఎన్నికలు అనివార్యం అయ్యాయి… ఒక పక్క టీఆర్ఎస్ పార్టీ తమ సీటును తామే కైవసం చేసుకోవాలని చూస్తుంటే ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ దుబ్బాక సీటును సొంతం చేసుకోవాలని చూస్తోంది…
ఇక బీజేపీ కూడా వారికి పోటీ తగులుతోంది.. దుబ్బాక సీటు తామే కైవసం చేసుకుంటామని చెబుతోంది… ఈ క్రమంలో బిగ్ బాస్ బ్యూటీ కత్తి కార్తీక దుబ్బాక ఎన్నికల బరిలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని భావిస్తోంది… అయితే ఆమెకు తీవ్రమైన బెధిరింపులు వస్తున్నాయి… ఈ క్రమంలో కార్తీక డ్రైవర్ ఇజాజ్ షరీఫ్ ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి బెధిరించారు.. దుబ్బాకలో కార్తీక పోటీ చేస్తే సజీవదహనం చేస్తామని భేదిరించినారు..
ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన కత్తి కర్తీ రామాయంపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది… గుర్తు తెలియని వ్యక్తులు తన కారు డ్రైవర్ ను బెధిరించారని ఫిర్యాదులో పేర్కొంది… ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు… స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్న ఒక మహిళకు ఇచ్చే గౌరవం ఇదే అని కార్తీ ప్రశ్నించింది…