బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మెడకు చుట్టుకుంటోంది… ఈకేసులో రకుల్ ప్రిత్ సింగ్ కు ఎన్ సీబీ అధికారులు నోటీసులు అందించనున్నారు… సుశాంత్ సింగ్ మృతితో వెలుగులోకి వచ్చిన బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది..
ఈ కేసులో ప్రస్తుతం నిందితురాలిగా ఉన్న రియా చక్రవర్తిని విచారించడంతో ఈకేసు డొంక కదిలింది ఇప్పటికే ఈ కేసులో భాగంగా రియాను ఎన్ సీబీ అరెస్ట్ చేసింది.. ఈ విచారణలో ఆమె పలువురు పేర్లు వెళ్లడించినట్లు వార్తలు వస్తున్నాయి….
అందులో భాగంగా బాలీవుడ్ హీరోయిన్లు సారా అలీ ఖాన్ శ్రద్దాకపూర్ విచారించేందుకు ఎస్ సీబీ సిద్దమైంది… వారిద్దరికి నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్దం చేస్తోంది… వారితోపాటు రకుల్ ప్రీత్ సింగ్ కూడా నోటీసులు ఇచ్చేందుకు సిద్దమయ్యారు అధికారులు…