గుడ్ న్యూస్ – ఉద్యోగం లేదా మీకు నిరుద్యోగ భృతి.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

గుడ్ న్యూస్ - ఉద్యోగం లేదా మీకు నిరుద్యోగ భృతి.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

0
98

కరోనా సమయంలో చాలా మందికి ఉద్యోగాలు ఉపాధి లేకుండా పోయింది… వీరు అనేక ఇబ్బందులు పడ్డారు.. దాదాపు లక్షల ఉద్యోగాలు కోల్పోయారు, అయితే కేంద్ర కార్మికశాఖ గుడ్న్యూస్ చెప్పింది ఇలాంటి వారికి అందరికి.

కరోనా వల్ల ఉద్యోగాలు కోల్పోయిన ఈఎస్ఐ చందాదారులకు నిరుద్యోగ భృతి ఇస్తోంది కేంద్రం.
వారి నెల జీతంలో 50 శాతం సొమ్మును భృతిగా చెల్లిస్తారు… అటల్ బీమిత్ వ్యక్తి కల్యాణ్ యోజన పథకం కింద ఈ సాయం లభిస్తుందని కేంద్ర కార్మికశాఖ తెలిపింది.

ఇక ఈ పథకం వచ్చే ఏడాది జూన్ 30 వరకూ కొనసాగుతుంది అని తెలిపారు, ఈ పథకం కింద గతంలో వేతనంలో 25 శాతం నిరుద్యోగ భృతి లభించగా.. ప్రస్తుతం దాన్ని 50శాతానికి పెంచారు. ఈ ఎస్ ఐ కార్యాలయాల్లో దీనికి నేరుగా అప్లై చేసుకోవచ్చు,ఆన్లైన్ద్వారాగానీ, పోస్టులోగానీ నిరుద్యోగ భృతి దరఖాస్తు పంపించవచ్చు. మీకు ఈ నగదు ఆన్ లైన్ లో బ్యాంకు ఖాతాలో జమచేసేస్తారు, ఇక ఆధార్ కాపీ అలాగే బ్యాంకు ఖాతావివరాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది, గతంలో ఉద్యోగం కోల్పోయిన 90 రోజుల తర్వాతే దరఖాస్తు చేయాల్సి ఉండేది. కానీ ప్రస్తుతం దాన్ని 30 రోజులకు తగ్గించారు.