అన్ని భాషల ఇండస్ట్రీ లలో కాస్టింగ్ కౌచ్ గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. మొన్నటి దాకా టాలీవుడ్ , హాలీవుడ్ లలో జరిగిన ఈ చర్చ బాలీవుడ్ కి చేరింది.. నానా పటేకర్ – తనుశ్రీ దత్తా వివాదం ఎంత దుమారం రేపిందో అందరికి తెలిసిందే.. అందరు గతం లో తమకు జరిగిన అనుభవాన్ని గుర్తు చేసుకుంటున్నారు.. తాజగా బుల్లితెర నటి రిచా బాద్రా తనకు ఎదురైనా చేదు అనుభవాన్ని ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూ ద్వారా తెలిపింది.
ఒక నిర్మాత తనను సంతోష పరిస్తే మంచి అవకాశం అందుకోవచ్చని వల్గర్ గా మాట్లాడాడు అని తెలిపింది. బాలీవుడ్ టెలివిజన్ సిరీస్ లతో బాగా పాపులర్ అయిన రిచా బాద్రా కిచిడి సిరీస్ తో చైల్డ్ ఆర్టిస్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. అయితే బుల్లితెర నుంచి సిల్వర్ స్క్రీన్ కు వెళ్లే ప్రయత్నంలో క్యాస్టింగ్ కౌచ్ వల్ల ఇబ్బంది పడ్డట్లు రిచా వివరణ ఇచ్చింది.
స్టోరీ డిస్కర్షన్‌లో భాగంగా హోటల్‌కి రమ్మని పిలిచినప్పటికి తాను కాఫీ షాప్‌కి మాత్రమే వస్తానని క్లారిటీ ఇచ్చిందట రిచా బాద్రా. అతని వ్యవహారం బయటపడిన తరువాత అతని నుంచి తప్పించుకున్నాని తెలిపింది. పెళ్లి చేసుకున్న తరువాత కుటుంబ సభ్యుల అంగీకారంతోనే మళ్లీ సీరియల్స్‌లో నటిస్తున్నానని చెప్పుకొచ్చింది రిచా. బాలీవుడ్ టెలివిజన్ సిరీస్‌లలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా బాగా పాపులర్ అయింది రిచా బాద్రా.