రెండేళ్లుగా నన్ను వేధిస్తున్నారు.. పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్య..!!

రెండేళ్లుగా నన్ను వేధిస్తున్నారు.. పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్య..!!

0
93

ఒకప్పుడు వెండితెరపై కనిపించి సందడి చేసిన నటి పూనమ్ కౌర్.. సినిమాల్లో ఉన్నపుడు అంత పెద్ద సక్సెస్ కాలేదు కానీ సినిమా ల నుంచి వెళ్ళిపోయాక మాత్రం ఆమె చాల ఫేమస్ అయిపొయింది.. తాజగా సోషల్ మీడియాలో ఎక్కువ పాపులర్ అవుతూ రోజు రోజుకి తన ఇమేజ్ పెంచుకుంటుంది.. అప్పట్లో కత్తి మహేష్ వర్సెస్ పవన్ కళ్యాన్ ఫ్యాన్స్ జరిగిన సోషల్ మీడియా యుద్దంలో పూనమ్ పై కూడా రక రకాల పుకార్లు పుట్టుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ విషయంపై అప్పుడేం స్పందించలేదు కానీ తాజాగా తనపై యూట్యూబ్‌లో అభ్యంతరకరమైన పోస్టింగ్‌లు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సినీనటి పూనం కౌర్ సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

సుమారు 50 యూట్యూబ్ ఛానళ్లపై ఆమె ఫిర్యాదు చేశారు. తనపై అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను పూనమ్ కోరారు. తనపై ఉద్దేశపూర్వకంగానే కొంతమంది వ్యక్తులు అసభ్యకర పోస్టులు పోస్టింగ్ చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఇటీవల కాలంలో ఈ పోస్ట్ ల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నదని ఆమె తన ఫిర్యాదు పేర్కొ న్నారు…

తనపై జరుగుతున్న ప్రచారానికి స్పందిస్తే మరింత రెచ్చిపోతారన్న ఉద్దేశంతోనే తాను ఇన్నాళ్లు ఫిర్యాదు చేయలేదన్నారు. అయితే, దీనిని అలుసుగా తీసుకున్న యూట్యూబ్ చానెళ్ల నిర్వాహకులు ప్రతిరోజూ పోస్టులు పెట్టి తనను మానసికంగా మరిన్ని చిత్రహింసలకు గురిచేస్తున్నారని పూనం కౌర్ ఆవేదన వ్యక్తం చేశారు. నటి ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.తనపై యూట్యూబ్‌లో అభ్యంతరకరమైన పోస్టింగ్‌లు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సినీనటి పూనం కౌర్ సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేసింది.