చెరుకురసం తాగితే కలిగే లాభాలు ఇవే తప్పక తెలుసుకోండి

-

చెరకుతోటల్లో ఇదివరకు చెరకు గడ్డలు తీసుకుని తినేవారు.. ఆరోజుల్లో పొలంకి వెళితే చెరకు తోటల్లో రైతులు ఇచ్చేవారు ,ఇక క్రషర్ కు వెళ్లే సమయంలో కూడా సగం చెరకు రోడ్లపై జనం తీసుకునేవారు, అయితే ఇప్పుడు పట్టణాల నుంచి చెరకు నగరాలకు వస్తోంది.. పూర్తిగా చాలా మంది ఈ చెరకు రసం తాగుతున్నారు.

- Advertisement -

ఇక సమ్మర్ వచ్చింది అంటే చెరకు రసం నిమ్మకాయ కలిపి తయారు చేస్తారు, దీనికి యమా డిమాండ్ ఉంటుంది, అయితే చెరకు రసం తీసుకుంటే చాలా మంచిది అంటున్నారు వైద్యులు…. శరీరం వేడెక్కినప్పుడు చెరుకు రసం చల్లబరుస్తుంది.

కామెర్ల వ్యాధితో బాధపడేవారికి చెరుకు రసం తోడ్పడుతుంది. మీకు నీరసం ఉంటే చెరకు రసం తాగండి, ఇక జ్వరం వచ్చిన సమయంలో కూడా చెరకు రసం తీసుకోవచ్చు, జలుబు చేసిన సమయంలో మాత్రం తీసుకోవద్దు, ఇక చెరకు రసం బాగా దప్పిక తీర్చుతుంది, అలా అని ఐస్ తో తాగితే మాత్రం మరింత దాహం వేస్తుంది తేడా గమనించుకోండి.

చెరుకు రసం ప్రోటీన్ లెవల్స్ని పెంచుతుంది. లివర్ను ఆరోగ్యంగా ఉంచుతుంది.క్యాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు, ఎలక్ట్రోలైట్స్, మెగ్నీషియం, ఐరన్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని డీహైడ్రేట్కు గురవ్వకుండా కాపాడుతాయి. గొంతు నొప్పి తగ్గడానికి ఇది తోడ్పడుతుంది, ఇక ఇమ్యునిటీ పవర్ కూడా పెరుగుతుంది. ఇందులో షుగర్ వేసుకుని మాత్రం తాగద్దు అంటున్నారు నిపుణులు.

.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

‘మరోసారి బీసీలను మోసం చేసేందుకు రేవంత్ సర్కార్ కుట్ర’ 

సమగ్ర కులగణన జరిపి, స్థానిక సంస్థల్లో బి.సి లకు 42 శాతం...

Group 1 Mains: తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల

తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్...