అలర్ట్ – అలాంటి ఏటీఎంలు క్లోజ్ చేస్తున్నారు

అలర్ట్ - అలాంటి ఏటీఎంలు క్లోజ్ చేస్తున్నారు

0
88

ఇప్పటికే చాలా వరకూ డిజిటల్ బాటలో నడుస్తోంది మన ప్రపంచం, ఇక చాలా వరకూ ఆన్ లైన్ లావాదేవీలు చేస్తున్నారు అందరూ, అసలు నేరుగా బ్యాంకింగ్ లావాదేవీలు తగ్గిపోయాయి, ఇక ఏటీఎంలకు వెళ్లి నగదు విత్ డ్రా చేసుకునే వారు కూడా చాలా వరకూ తగ్గిపోయారు.

సో బ్యాంక్ ఏటీఎంలు ఒక్కొక్కటిగా షట్డౌన్ అవుతున్నాయి. అవును చాలా వరకూ డిజిటల్ బాటలో వెళ్లడంతో ఇక ఏటీఎంలు అవసరం తగ్గుతోంది, ప్రభుత్వ బ్యాంకులు చాలా వరకూ ఇక ఏటీఎంలను తగ్గించుకుంటున్నాయి, ఇక వ్యయ భారం కూడా తగ్గుతుంది.

రోజూ 200 స్వైపింగ్ లేని ప్రాంతాలను గుర్తించి ఏటీఎంలను ఎత్తివేసేందుకు రంగం సిద్ధమవుతోంది ఇప్పటికే ఇలాంటివి దాదాపు 20 శాతం గుర్తించారు.. వాటిని తీసేందుకు సిద్దం అవుతున్నారు,ఎక్కువగా ప్రభుత్వ రంగ బ్యాంకుల ఏటీఎంలు ఉన్నట్లు గుర్తించారు.