ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు హస్తినకు బయల్దేరనున్నారు… ఈ పర్యటనలో జగన్ ప్రధాని మోడీని కలవనున్నారు… పలు విషయాలపై చర్చించనున్నారు…
ప్రధానంగా శాసనమండలి రద్దు అలాగే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు జీఎస్టీ నిధులు, పోలవరం ప్రాజెక్ట్ తదితర అంశాలను జగన్ మోడీతో చర్చించనున్నారు… మరో వైపు జగన్ ఢిల్లీ టూర్ పై ఆసక్తికర చర్చ కొనసాగుతోంది…
కేంద్ర కేబినెట్ లోకి వైసీపీ చేరబోతుందని వార్తలు వస్తున్నాయి.. వైసీపీకి 2 కేబినెట్ ఒక సహాయ మంత్రి, ఇండిపెండెంట్ ఛార్జ్ పదవులను ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి..