కరోనా మహమ్మారి ఎవ్వరిని వదలకుంది.. ముఖ్యంగా సెలబ్రెటీలు ప్రజాప్రతినిధులు ఎక్కువగా కరోనా బారీన పడుతున్నారు… ఇప్పటికే చాలామంది కరోనా బారీన పడి డిశ్చార్జ్ అవ్వగా కొందరు మృతి చెందారు… ఇదే క్రమంలో తెలుగు స్టార్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా కూడా కరోనా బారీన పడిన సంగతి తెలిసిందే..
ఆమె హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వారం రోజుల పాటు చికిత్స తీసుకుని తాజాగా డిర్చార్జ్ అయింది… ఈ మేరకు తమన్నా ఒక ప్రకటన కూడా విడుదల చేసింది… తాను కరోనా నుంచి కోలుకున్నానని తెలిపింది… తాను కోలుకోవాలని తన కోసం ప్రార్థనలు చేసిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపింది…
సెట్ లో కరోనా జాగ్రత్తలు తీసుకున్నా కూడా తనకు కరోనా పాజిటివ్ గా నిర్దారన అయిందని తెలిపింది… కాగా గతంతో తమన్నా తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్ వచ్చినప్పుడు ఆమె కూడా కరోనా టెస్ట్ చేయించుకుంది.. అప్పుడు నెగిటివ్ వచ్చింది… కొద్దిరోజుల క్రితం జ్వరంతో బాధపడుతుండటంతో వైద్యులు మరోసారి కరోనా టెస్టులు చేశారు… దీంతో ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలింది.