నాని జెర్సీ మూవీ రివ్యూ అండ్ రేటింగ్..!!

నాని జెర్సీ మూవీ రివ్యూ అండ్ రేటింగ్..!!

0
160

నటీనటులు : నాని, శ్రద్ధా శ్రీనాథ్, సత్యరాజ్, ప్రవీణ్, సంపత్
దర్శకత్వం : గౌతమ్ తిన్ననూరి
నిర్మాత : సూర్యదేవర నాగవంశీ
మ్యూజిక్ : అనిరుధ్ రవిచందర్
విడుదల తేదీ : ఏప్రిల్ 19 2019

న్యాచురల్ స్టార్ నాని రోజు రోజుకి తన స్టామినా పెంచుకుంటూ పోతున్నాడు.. వరుస హిట్లతో స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిపోయాడు.. అలాంటిది గత రెండు సినిమాలు గా నాని మేనియా తగ్గింది.. ఆ సినిమా అనుకున్నంత హిట్ కాకపోవడంతో కాస్త వెనకపడిపోయాడు.. ఈ సారి హిట్ కొట్టాలని జెర్సీ లాంటి వినూత్నమైన కథాంశం తో మనముందుకు వచ్చాడు.. ఎన్నో అంచనాలతో క్రికెట్ ఆట నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు రాగ ఈ సినిమా వారిని ఏ మేరకు మెప్పించిందో ఈ సమీక్షలో చూద్దాం..

కథ :
చిన్నప్పటినుంచి అర్జున్ (నాని) కి క్రికెట్ అంటే ఇష్టం.. ఎలాగైనా టీం ఇండియా కి ఆడాలనేది అర్జున్ కోరిక.. అందుకు తగ్గట్లే ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అర్జున్ మంచి క్రికెటర్ గా పేరు తెచ్చుకున్నాడు.. అయితే ఇండియన్ టీం కి ఎంపిక చేయలేదనే ఆవేశంతో క్రికెట్ ని వదిలేశాడు.. సారా (శ్రద్ధా శ్రీనాధ్) అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న అర్జున్ కుటుంబం కోసం గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుంటాడు.. ఓ సారి ఓ ఘటన వల్ల ఉద్యోగం కోల్పోయిన అర్జున్ రెండుళ్లుగా ఖాళీగా ఇంట్లోనే ఉంటాడు.. దాంతో సారా కుటుంబ బాధ్యతలు తీసుకుని వారి కొడుకు నాని (రోనిత్) ని పెంచుతూ ఉంటుంది.. కానీ కొడుకు కోరికమేరకు, పరిస్థితుల మధ్య మళ్ళీ క్రికెట్ లోకి అడుగుపెట్టి సంవత్సరాలుగా రంజీ ట్రోఫీ గెలవని హైదరాబాద్ టీం కి కప్ తేవడంలో ముఖ్య పాత్ర పోషిస్తాడు.. అసలు క్రికెట్ నుంచి అర్జున్ వైదొలగడానికి , మళ్ళీ క్రికెట్ లోకి రావడానికి అసలు కారణాలు ఏంటి.. అనేది తెరపైనే చూడాలి..

విశ్లేషణ :

చచ్చేవరకు ప్రయత్నించడం కాదు.. చేస్తామని తెలిసినా ప్రయత్నించు అనే కాన్సెప్ట్ ని ఈ సినిమా ద్వారా తెరపై కన్నులకు కట్టినట్లు చూపించాడు నాని.. అసలు నానికొసమే ఇలాంటి కథలు పుట్టుకొస్తాయి అన్నట్లు ఉంది సినిమా.. సినిమా కి వెళ్లిన ప్రతి ఒక్కరు ఎదో ఒక సీన్ వద్ద కంటతడి పెట్టకుండా ఉండలేరు.. ముఖ్యంగా భార్యాభర్తల సీన్, తండ్రి కొడుకుల మధ్య వచ్చే సీన్స్ ఎంతో సెంటిమెంటల్ గా గుండెకు హత్తుకునేలా ఉంటాయి. దర్శకుడు గౌతమ్ ఈ స్టోరీ తో అందరిని ఆలోచింపచేశాడు.. ఇలాంటి కొత్త కథలకు వచ్చేఅందుకు పునాదులు వేశాడు.. ప్రతి సీన్ శిల్పాన్ని చెక్కినట్లు చెక్కాడు.. క్లైమాక్స్ లో ప్రతి డైలాగ్ , ట్విస్ట్ చాల బాగుంటుంది.. వారు ఊహించని మలుపుతో సినిమా ఎండ్ అయ్యి ప్రతి ప్రేక్షకుడిని ఆలోచింప చేసేలా చేస్తుంది.. ఈ సినిమా లో హైలైట్ స్టోరీ.. రెగ్యులర్ స్టోరీ అయినా స్పోర్ట్స్ ఎమోషన్లో ఫామిలీ ఎమోషన్ ని మిక్స్ చేసి చక్కగా తీర్చిదిద్దాడు.. చివర్లో వచ్చే క్రికెట్ మ్యాచులు సినిమా కోసం తెరకెక్కినట్లుగా ఉండవు.. నిజంగా క్రికెట్ చుస్తున్నామా అన్న ఫీల్ ని కలిగిస్తాయి. సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫీ చాలాబాగుంది.. తొంభై దశకంలో వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించాడు.. అనిరుద్ మ్యూజిక్ చాల బాగుంది.. పాటలు పర్వాలేదు కానీ నేపథ్యం సంగీతం మాత్రం సినిమా కి ప్రాణం పోసింది.. తన మ్యూజిక్ తో సినిమా లో మంచి ఎమోషన్ ని నింపాడు.. నిర్మాణ విలువలు చాల బాగున్నాయి.. సినిమా లో నాని నటనే హైలైట్..ఈ సినిమా లో ఇక్కడ నాని కనిపించాడు.. క్రికెటర్ అర్జున్ కనిపిస్తాడు.. ప్రతి సీన్ లో ఎంతో ఒదిగిపోయి నటిస్తాడు.. ఫస్ట్ టైం నాని క్రికెటర్ గా కనిపించిన ఆ పాత్రలో నటించాడనే ఆలోచనే కలగదు.. అంతలా ఆ పాత్రలో ఒదిగిపోయాడు.. అందుకేనేమో నాని కి న్యాచురల్ స్టార్ అనే పేరొచ్చింది.. ఇక హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్.. ఈ మధ్య వచ్చిన కొత్త హీరోయిన్స్ లో ది బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది.. చూస్తుంటే మంచి ఫ్యూచర్ ఉండేలానే కనిపిస్తుంది.. సత్యరాజ్ సపోర్టింగ్ పాత్రలో చాల బాగా నటించాడు.. సినిమా మొదటినుంచి చివరిదాకా నానిని సపోర్ట్ చేస్తూ పాత్రలో జీవించాడు.. బాలనటుడు రోనిత్ అర్జున్ (నాని) కొడుకుగా చాల ముద్దు ముద్దుగా నటించాడు.. ఇతర పాత్రలు ఇలా వచ్చి అలా వెళ్లినా సినిమా చాల ఇంపార్టెంట్ రోల్స్.. అందరు చాల బాగా నటించారు..

ప్లస్ పాయింట్స్ :

నాని నటన..

గౌతమ్ డైరెక్షన్

నేపథ్య సంగీతం

మైనస్ పాయింట్స్ :

లెంగ్త్ కాస్త ఎక్కువ..

ఓవరాల్ గా నాని నుంచి వచ్చిన మరో ఎమోషనల్ సినిమా జెర్సీ.. ప్రజెంట్ ఫామిలీ అందరు వెళ్లి కలిసి చూసే మంచి ఫీల్ ఉన్న సినిమా.. క్రికెట్ ని ఇష్టపడేవారికి కాకుండా ఫామిలీ సినిమా లు ఇష్టపడేవారికి ఈ సినిమా తప్పకుండ నచ్చుతుంది..

రేటింగ్ : 3.5/5