దసరా వస్తోంది అంటే విజయవాడ ఇంద్రకీలాద్రి గుర్తు వస్తుంది, అమ్మ దుర్గమ్మ దర్శనం కోసం లక్షలాది మంది వస్తుంటారు, ఈ దసరా ఉత్సవాలకు శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శనానికి మరి ఎంత మందిని అనుమతిస్తారు అనేది ఇప్పటి వరకూ అందరూ ఆలోచించారు.
దర్శనం టోకెన్లు… అయితే దేవి శరన్నవరాత్రుల దసరా మహోత్సవాన్ని 17-10-2020 నుంచి 25-10-2020 వరకు జరుపుతున్నట్లుగా దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ప్రకటన రిలీజ్ చేసింది. కరోనా వైరస్ దృష్ట్యా రోజుకి 10,000 మంది భక్తులకు మాత్రమే టైం స్లాట్ ప్రకారం దర్శనం కల్పిస్తారు.
ఇక టికెట టోకెన్లు చూస్తే రూ.300ల టికెట్లపై 3000 మందిని, రూ.100ల టికెట్లపై 3000 మందిని, ఫ్రీ టోకెన్స్ పై 4000 మంది భక్తులకు ఉచిత దర్శనం కల్పిస్తారు. భక్తులకి పూజ టిక్కెట్లన్నీ ఆన్ లైన్ ద్వారా మాత్రమే అమ్ముతారు.
దేవస్థాన వెబ్ సైట్ kanakadurgamma.org అలాగే… దేవస్థాన mobile app kanakadurgamma ద్వారా భక్తులు టిక్కెట్లు కొనేందుకు వీలుంది.
ఇక అమ్మవారి దర్శన వేలలు చూద్దాం..
ఉదయం 5.00 గంటల నుంచి రాత్రి 8.00 గంటల వరకు భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. అమ్మవారి నక్షత్రమైన మూల నక్షత్రం రోజున దర్శన సమయం ఉదయ 3.00 గంటల నుంచి రాత్రి 9.00 గంటల వరకు ఉంటుంది. భక్తులు అందరూ మాస్క్ ధరించి రావాలి, సోషల్ డిస్టెన్స్ పాటించాలి.