మనం గుడికి వెళ్లిన సమయంలో దేవుడికి దీపం వెలిగిస్తాం, అలాగే దూపం వెలిగిస్తాం అగరబత్తి కొబ్బరికాయ అరటిపళ్లు లేదా అక్కడ ఫేమస్ ప్రసాదం ఏది అయితే అది నైవేద్యంగాపెడతాం, అయితే సాంబ్రాణి దూపం వేయడం కూడా మనం దేవాలయాల్లో చూస్తూ ఉంటాం.
అక్కడ ఆలయంలో భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి అగర్ బత్తి అవసరం లేదు. సిగరెట్ వెలిగించాలి.. ఔను మీరు విన్నది నిజమే. సిగరెట్ వెలిగిస్తే అక్కడ స్వామి ప్రసన్నం అవుతాడని భక్తుల నమ్మకం. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఉంది ఈ ఆలయం. సబర్మతి నది ఒడ్డున ఉంది.
దీన్ని దధీచి ఆశ్రమం అంటారు. ఇక్కడకు వచ్చే భక్తులు తమ కోరికలు నెరవేరాలంటే ప్రతి గురువారం ఆశ్రమంలో ఉన్న సమాధి అఘోరీ దాదా ఎదుట సిగరెట్లు వెలిగిస్తారు..అలాగే రోజా పూలు కూడా పెడతారు…సమాధి ఎదుట సిగరెట్లు, రోజా పూలు మాత్రమే పెడతారు.. ఇక ఇక్కడకు వచ్చే భక్తులు మాత్రం తక్కువ ధర సిగరెట్లు మాత్రమే పెడతారు. కొన్ని వందల పాకెట్లు సిగరెట్లు ఇక్కడ ఉంటాయి.
అహ్మదాబాద్ నగరం పుట్టకముందు నుంచే ఇది ఇక్కడ జనం ఫాలో అవుతున్నారట..బెంజ్ కారులో వచ్చినా, గంజి తాగే భక్తుడు అయినా కూడా అక్కడ మాత్రం చీప్ సిగరెట్లను వెలిగించాలి. ఖరీదైన సిగరెట్లను వెలిగించడానికి వీల్లేదు..ఇక్కడ సమాధి ఎదురుగా సిగరెట్లు వెలిగించి నమస్కరించి వెళతారు.