viewsonic india: స్పెషల్‌ ఎడిషన్‌ మానిటర్లను విడుదల చేసిన వ్యూ సోనిక్‌

viewsonic india

viewsonic india launches limited edition monitors with eye care technology: విజువల్‌ పరిష్కారాలను అందించడంలో అంతర్జాతీయంగా సుప్రసిద్ధమైన వ్యూ సోనిక్‌ నేడు లిమిటెడ్‌ ఎడిషన్‌ మానిటర్లను ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ ను వేడుక చేయడంలో భాగంగా విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది.

దీనిలో భాగంగా నాలుగు నూతన వర్క్‌ మరియు బిజినెస్‌ మానిటర్‌ వేరియంట్లను ఫుల్‌ హెచ్‌డీ లో 22 అంగుళాలు, 24 అంగుళాలు, 27 అంగుళాల వేరియంట్లలో విడుదల చేసింది. ఈ మానిటర్లు వినియోగదారులను ఆకట్టుకునేలా అత్యాధునిక ఫీచర్లు, సాంకేతికతలను కలిగి ఉంటాయి. ఈ మోడల్స్‌లో VA1903H-2-IN1 (19″), VA2215-H-IN1 (22″), VA2432-MH-IN1 (24″) and VA2732-MH-IN1 (27″) లు అత్యంత ఆకర్షణీయమైన ఫీచర్లను విస్తృత శ్రేణి వీక్షణ యాంగిల్స్‌, ఐ కేర్‌ టెక్నాలజీ కలిగి ఉంటాయి. ఇవి వినియోగదారులకు సాంకేతికత, సౌకర్యం అందిస్తాయి. అంతేకాదు, ఈ మానిటర్లు వినియోగదారుల కళ్లకు హాని కలిగించని రీతిలో ఐ కేర్‌ టెక్నాలజీ సైతం కలిగి ఉంటాయి.

ఈ స్పెషల్‌ ఎడిషన్‌ మానిటర్లను విడుదల చేయడం గురించి వ్యూసోనిక్‌ ఇండియా సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ డైరెక్టర్‌ – ఐటీ బిజినెస్‌, సంజోయ్‌ భట్టాచార్య మాట్లాడుతూ ‘‘ ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ మానిటర్లను భారతీయ వినియోగదారుల కోసం విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఈ ఆవిష్కరణతో డిజిటల్‌ సాధికారిత కలిగిన దేశంగా ఇండియాను మలచాలనుకుంటున్నాము. ఈ విభాగంలోని ప్రతి మానిటర్‌ అత్యాధునిక సాంకేతికత కలిగి ఉంటుంది’’ అని అన్నారు.

Link to product page:

VA1903H-2-IN1: https://www.viewsonic.com/in/products/lcd/VA1903H-2
VA2215-H-IN1: https://www.viewsonic.com/in/products/lcd/VA2215-H
VA2432-MH-IN1: https://www.viewsonic.com/in/products/lcd/VA2432-MH
VA2732-MH-IN1: https://www.viewsonic.com/in/products/lcd/VA2732-MH

Read Also: ఇద్దరి సీఎం ల డ్రామాలు.. స్కామ్ డైవర్షన్ కోసమే!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here